తెరపై అందంగా కనిపించడం లోనైనా, పాత్రకు తగ్గట్టు నటనను ప్రదర్శించడం లోనైనా తిరుగులేని ఆ నటి మంజుల. అందాల తారగా బంగారు బొమ్మగా తెలుగు ప్రేక్షకుల మధ్య చెరగని ముద్ర వేసిన ప్రముఖ తార మంజుల. మంజుల వ్యక్తిగత జీవితం మనం చూసినట్లయితే… 1953 సెప్టెంబర్ 9 న మంజుల చెన్నైలో జన్మించారు. అక్కడే పుట్టి పెరిగిన మంజుల తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో 100కు పైగా చిత్రాలు నటించారు. మంజుల 12 ఏళ్ల నుంచే నటించడం మొదలుపెట్టింది.
అప్పటిలో ఉన్న అగ్ర నటులతో నటించారు. ఇక మంజుల వివాహ జీవితం చూసుకున్నట్లయితే ఒక తమిళ చిత్రంలో నటిస్తుండగా ఆ చిత్రానికి హీరోగా నటించిన విజయ్ కుమార్ నీ ప్రేమించి పెళ్లి చేసుకుంది. విజయ్ కుమార్ కి అంతకుముందే పెళ్లి అయింది. తన మొదటి భార్య ముత్తు అంగీకారంతో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరందరూ కలిసే ఉండేవాళ్ళు మంజుల ఇక తన ఆయన మొదటి భార్య అయిన ముత్తుతో కలిసి వీళ్ళు ఇద్దరు తిరిగేవారు.
పెళ్లి చేసుకున్న తర్వాత చిత్రాలకు పూర్తిగా దూరం అయ్యారు. మంజుల విజయ్ కుమార్ లకు ముగ్గురు కూతుర్లు పుట్టారు. వారు ప్రీతి, నవిత, శ్రీదేవి. మంజుల ఆమె ముగ్గురు కూతుళ్ళకి పెళ్లిల్లు చేశారు. కూతుర్ల పెళ్లిల తర్వాత తెలుగులో రెండు మూడు సినిమాలు చేశారు. ఇక చివరి దశలో ప్రముఖ నటి మంజుల ఒక వ్యాధి వల్ల మంచాన పడింది. మంచం మీద నుంచి కింద పడడం వల్ల తలకు దెబ్బ తగిలి గాయాలయ్యాయి. దానితో విజయకుమార్ ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మరణించారు. మంజుల తన 59వ ఏటా జూలై 23న 2013వ సంవత్సరంలో ఆకస్మిక మరణం చెందారు.
కానీ మంజుల భర్త గురించి తెలియని చాలా నిజాలు ఉన్నాయి. విజయ్ కుమార్ గురించి నిజాలు బయట పెట్టింది తన సొంత కూతురే. మంజులను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని చెప్పింది. మంజుల ఆస్తిపై ఆశపడి ప్రేమించినట్టు నటించి పెళ్లి చేసుకున్నాడు. ఇక మంజులకి తాగడం నేర్పించి మందుకు బానిస చేశాడు. తరువాత ఆమె మంచాన పడడం వల్ల తన ఆస్తి మొత్తం కాజేసి అనుభవించాడు. మంజుల చివరి క్షణాల్లో తననీ సరిగ్గా కూడా చూసుకోలేదట. మంజుల అనారోగ్యం పాలుకావడం ఇంకా తన చావుకి కారణం తన నాన్న విజయ కుమార్ యే అని తన కూతురు వనిత చెప్పింది.