Health Tips: వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవాలనుకుంటున్నారా…ఈ కషాయాలు ప్రయత్నించాల్సిందే!

Health Tips: శీతాకాలం అనగానే అనేక ఆరోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి,, ముఖ్యంగా దగ్గు,జలుబు, జ్వరం వంటి సమస్యలు శీతాకాలం లో ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోంది. ఇటువంటి సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి వ్యాధి నిరోధక శక్తి చాలా అవసరం. మన ఇంట్లో లభించే కొన్ని ఆహార పదార్థాలు ఉపయోగించి కషాయాలు తయారు చేసుకొని వాటిని తాగటం వల్ల శీతాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.

మన ఇంట్లో తరచూ లభ్యమయ్యే వాటిలో నిమ్మ పండ్లు ఖచ్చితంగా ఉంటాయి. నిమ్మ పండులో సిట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి ఎంతో ఉపయోగపడుతుంది. నిమ్మకాయలు గుండ్రంగా ముక్కలుగా చేసి నీటిలో వేసి బాగా మరిగించాలి, అందులో తురిమిన అల్లం వేసి ఆ నీటిని బాగా మరిగించి తాగటం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఇలా ప్రతి రోజూ తాగటం వల్ల గ్యాస్టిక్ వంటి సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి.

పసుపు లో కూడా యాంటీబయటిక్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.ప్రతిరోజు పాలలో పసుపు వేసుకొని తాగటం వల్ల దగ్గు జలుబు వంటి సమస్యలు దూరం అవ్వడమే కాకుండా వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే నీటిలో కొంచెం అల్లం ,పుదీనా ఆకులు ,తులసి, నిమ్మరసం ,పసుపు వేసి బాగా మరిగించి కషాయం తయారుచేసి తాగడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.

మన వంటింట్లో ఉండే మసాలా దినుసులు ఉపయోగించి కషాయం తయారు చేయవచ్చు. దాల్చిన చెక్క ,అల్లం, తులసి ఆకులు ,యాలకులు ,లవంగాలు వేసి ఒక కప్పు నీటిలో బాగా మరిగించి ఆ నీటిని తాగటం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.