Charcoal: ప్రస్తుత కాలంలో పెరుగుతున్న వాతావరణ కాలుష్యం వల్ల అనేక ఆరోగ్య సమస్యలతో పాటు చర్మ సంబంధిత సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. స్కూల్ , కాలేజీ , ఉద్యోగాలు అంటూ బయట తిరగటం వల్ల దుమ్ము , ధూళి చేరి చర్మ సమస్యలు మొదలవుతున్నాయి. చర్మ సమస్యలకు మార్కెట్లో ఎన్నో రకాల ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ ప్రాచీన కాలం నుండి వినియోగంలో ఉన్న బొగ్గు వల్ల చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చవచ్చు. బొగ్గు వల్ల చర్మానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
బొగ్గును సరైన పద్ధతిలో వాడటం వల్ల అనేక రకాల బ్యూటీ బెనిఫిట్స్ పొందవచ్చు. యాక్టివేటెడ్ చార్కోల్ అనేది ఆక్సిజన్ వాయువుతో అధిక ఉష్ణోగ్రత వద్ద పౌడర్ చేసిన చార్కోల్ ని యాక్టివేటెడ్ చార్కోల్ అంటారు. ప్రస్తుతం ఈ యాక్టివేటెడ్ చార్కోల్ అనేక రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ లో వినియోగిస్తున్నారు. యాక్టివేటెడ్ చార్కోల్ నీ ఫేస్ మాస్క్ , ఫేస్ స్ర్కబ్ , సోప్స్ గా ఉపయోగిస్తున్నారు .
యాక్టివేటెడ్ చార్కోల్ ఫేస్ మాస్క్ ల ఉపయోగించవచ్చు. ఒక టేబుల్ స్పూన్ యాక్టివేటెడ్ చార్కోల్ , కొంచెం కొబ్బరి నూనె నీళ్లు కలిపి మొహానికి రాసుకోవడం వల్ల చర్మం మీద ఉన్న రంధ్రాలు తెరచుకొనేలా చేసి చర్మ గ్రంధులలో ఉన్న మురికి తొలగిపోయేలా చేస్తుంది. యాక్టివేటెడ్ చార్కోల్ ఫేస్ మాస్క్ ల ఉపయోగించటం వల్ల ముఖం మీద ఉన్న జిడ్డు తొలగించి ముఖం కాంతివంతంగా ఉండేలా చేస్తుంది.
ఆక్టివేట్ చార్కోల్ లో కొంచెం నీటిని కలిపి మొహానికి రాసుకోవడం వల్ల చర్మం మీద పేరుకుపోయిన దుమ్ము ధూళి కణాలను శుభ్రపరిచి మొటిమలు, బ్రేక్ అవుట్‌లను రాకుండా చెయవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో యాక్టివేటెడ్ చార్కోల్ బ్యూటీ ప్రొడక్ట్స్ చాలా అందుబాటులో ఉన్నాయి..వాటివల్ల చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు.