AP: వైసీపీ 2.0 నెక్స్ట్ టార్గెట్ వారేనా.. సంచలనగా మారిన పోస్టులు?

AP: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలు కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెడుతూ వారందరిని జైలుకు పంపించడమే కాకుండా ఎన్నో చిత్రహింసలకు గురి చేశారు. ఈ క్రమంలోనే వైసీపీ సోషల్ మీడియా కూడా కాస్త స్పీడ్ తగ్గించింది. అయితే తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గురించి అలాగే తమ పార్టీ గురించి ఎవరైనా అంటే మాత్రం వైసిపి సోషల్ మీడియా ఒక్కసారిగా అటాక్ చేస్తారనే సంగతి ఇదివరకు ఎన్నోసార్లు రుజువు అయింది.

తాజాగా పృథ్వి రాజ్ చేసిన కామెంట్లతో ఏకంగా లైలా సినిమానే బాయ్ కాట్ చేయాలి అంటూ వైసీపీ అభిమానులు సోషల్ మీడియాలో ఒక హాష్ టాగ్ ట్రెండ్ చేస్తున్నారు అదేవిధంగా జగన్ మోహన్ రెడ్డి 2.0 గురించి మాట్లాడటంతో తిరుపతి జనసేన ఇన్చార్జి కిరణ్ రాయల్ ఏకంగా జగన్ 2.0 ను రోబో 2.0 తో పోలుస్తూ ఎంతో హేళనగా మాట్లాడరు.

ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన వైసిపి కార్యకర్తలు కిరణ్ రాయల్ గుట్టు మొత్తం బయట పెట్టడంతో పవన్ కళ్యాణ్ సైతం స్పందించారు. కొద్దిరోజులపాటు కిరణ్ రాయల్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలి అంటూ ఆదేశాలను జారీ చేశారు. ఇలా వైసిపి సోషల్ మీడియా తిరిగి ఫుల్ యాక్టివ్ అవుతోంది.

ఈ క్రమంలోనే కొంతమంది వైసిపి కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా వైకాపా 2.0 నెక్స్ట్ టార్గెట్ సీమరాజు, కిరాక్ ఆర్పీ, హైపర్ ఆది అంటూ కొన్ని పోస్టులను షేర్ చేస్తూ ఉన్నారు. ఇక హైపర్ ఆది సైతం ఎన్నో సినిమా ఈవెంట్లలోను అదే విధంగా జబర్దస్త్ కార్యక్రమంలో కూడా వైసిపి గురించి సెటైర్లు వేస్తూ హేళనగా మాట్లాడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే హైపర్ ఆదిని సైతం వైసీపీ కార్యకర్తలు టార్గెట్ చేశారని చెప్పాలి.

ఇక సీమ రాజు కూడా వైసీపీ పార్టీలో ఉంటూనే వైసీపీ పై విమర్శలు చేయడంతో ఈయన కూడా టార్గెట్ గా నిలిచారు. ఇక కిరాక్ ఆర్పి గురించి చెప్పాల్సిన పనిలేదు. నిత్యం జగన్మోహన్ రెడ్డి గురించి అలాగే మాజీమంత్రి, జబర్దస్త్ జడ్జ్ అయిన రోజా గురించి నిత్యం ఏదో ఒక విమర్శలు చేస్తూ వార్తలో నిలుస్తున్నారు. దీంతో ఈ ముగ్గురిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా చేస్తున్న పోస్టులు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.