2019 ఎన్నికల్లో కనీవిని ఎరుగని స్థాయిలో 151 ఎమ్మెల్యే స్థానాలలో విజయం సాధించిన జగన్ సర్కార్ కు ప్రస్తుతం 2024 ఎన్నికల విషయంలో భయం పట్టుకుందా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సీమ గర్జన పేరుతో కర్నూలులో జగన్ సర్కార్ నిర్వహించిన కార్యక్రమం ఫ్లాపైంది. ఈ కార్యక్రమం ఫ్లాప్ కావడానికి రీజన్ ఏంటనే ప్రశ్నకు జగన్ సర్కార్ చేసిన చిన్నచిన్న తప్పులే కారణం కావడం గమనార్హం.
జగన్ సర్కార్ కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసినంత మాత్రాన జిల్లాకు కొత్తగా కలిగే బెనిఫిట్స్ ఏమీ ఉండవు. ఈ విషయం జగన్ కు కూడా తెలుసు. అయితే సీమగర్జన పేరుతో వైసీపీ నిర్వహించిన ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో జనం వచ్చినా వైసీపీ నేతలు మాత్రం ఎందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారో చెప్పలేక తడబడ్డారు. చాలామంది నేతలు తమకు ఎక్కువ సమయం మాట్లాడే అవకాశం లేకుండా పోయిందని అభిప్రాయపడ్డారు.
ఏపీలో వైసీపీ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న పార్టీ ఈ తరహా కార్యక్రమాలు చేయడం ఏంటని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సీమగర్జన కోసం మూడు జిల్లాల నుంచి జన సమీకరణ జరగడం గమనార్హం. ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు సభకు హాజరు కాగా సరైన సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. పార్టీలో పాపులారిటీ ఉన్న నేతలు హాజరు కాకపోవడం ఈ సభకు మైనస్ అయింది.
జగన్ సర్కార్ రాబోయే రోజుల్లో ఈ తప్పులు పునరావృతం కాకుండా అడుగులు వేయాల్సి ఉంది. ఎన్నికలకు 15 నెలల సమయం మాత్రమే ఉండగా జగన్ సర్కార్ ఏ చిన్న తప్పు చేసినా ఆ ప్రభావం ఎన్నికల ఫలితాలపై పడుతుందని చెప్పవచ్చు. ప్రజల మెప్పు పొందే నిర్ణయాల దిశగా జగన్ సర్కార్ అడుగులు వేస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.