వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మాత్రం తన సొంత పార్టీనే టార్గెట్ చేసుకున్నారు. వైసీపీ పార్టీ నుంచి ఎంపీగా గెలిచి.. తర్వాత పార్టీకే ఎదురుతిరిగి.. పార్టీ పరువును గంగలో కలుపుతున్నారు. వైసీపీ పరువు తీయడానికి ఎవ్వరో అవసరం లేదు. ఈయన ఒక్కరు చాలు. పార్టీ నేతలనే కాదు.. సీఎం జగన్ ను కూడా ఈయన వదిలిపెట్టడం లేదు.
ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ అంటే.. హిందూ దేవాలయాల మీద జరుగుతున్న దాడులు. ఈ దాడులు ఎవరు చేస్తున్నారు.. ఎవరు చేయిస్తున్నారో కానీ.. బ్యాడ్ నేమ్ మాత్రం డైరెక్ట్ గా సీఎం జగన్ కే వస్తోంది. ఎందుకంటే.. ఆయన క్రిస్టియన్ మతాన్ని నమ్మడం. జగన్ క్రిస్టియన్ అని.. అందుకే హిందూ దేవాలయాలపై దాడులు చేయిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. హిందూ దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులపై సీఎం జగన్ కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా… చూసుకోవాలంటూ అధికారులను, పోలీసులను సీఎం జగన్ ఆదేశించారు.
కానీ.. బాల్ మాత్రం సీఎం జగన్ దగ్గరికే వెళ్తోంది. చివరకు తన సొంత పార్టీ ఎంపీ రఘురామ కూడా హిందూ దేవాలయాల మీద జరుగుతున్న దాడిపై సీఎం జగన్ ను నిందిస్తున్నారు. హిందూ దేవాలయాలపై ఇలా దాడులు జరుగుతుంటే జగన్ ఎందుకు స్పందించడం లేదంటూ ఆయన విరుచుకుపడ్డారు.
సీఎం జగన్ తో పాటు ఏపీ డీజీపీ కూడా వేరే మతాలకు చెందిన వారు. అందుకే హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతుంటే.. పెళ్లయిన ఆరునెలలకు కుక్కలు మొరిగినట్టుగా.. 18 నెలల తర్వాత సీఎం జగన్ ఇప్పుడు దాడుల గురించి మాట్లాడటం ఏంటంటూ రఘురామ విరుచుకుపడ్డారు.