పొంగూరు నారాయణ ఊరూవాడా కార్పొరేట్ విద్యని పరిచయం చేసి పాపులర్ అయిన వ్యక్తి నారాయణ విద్యాసంస్థల అధినేత.. ఈయనకు టీడీపీతో, ఆ పార్టీ అధినేతతో ఉన్న అనుబంధం ఇప్పటిది కాదు. తెర వెనుక టీడీపీకి ఆర్థికంగా అండదండగా ఉన్న నారాయణ ప్రజాక్షేత్రంలో ఎన్నికల బరిలో నిలవకుండానే మంత్రి అయ్యారు. తర్వాత ఎమ్మెల్సీ పదవి పొందారు. ఐదేళ్లు మున్సిపల్ శాఖ మంత్రిగా కేబినెట్‌లో ఆయన హవానే నడిచింది. అమరావతి రాజధాని నిర్మాణంలోనూ ఆయనదే కీలకపాత్ర. అధినేతకు ఆయన మీదున్న నమ్మకం అలాంటిది.
ఇక టీడీపీని తన ఇంటి పార్టీగా చేసుకున్న నారాయణ తనకు ఎమ్మెల్సీ పదవి ఉన్నా కూడా మితి మీరిన విశ్వాసంతో గత ఎన్నికల్లో నెల్లూరు నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అదిగో అప్పటినుంచి పూర్తిగా తెరమరుగయ్యారు. అలాగని పార్టీకి, చంద్రబాబుకి హ్యండ్ ఇచ్చాడా అంటే అదేం లేదట.. ఇదంతా ఒక ప్లాన్‌లో భాగంగానే తాను టీడీపీతో దూరంగా ఉంటున్నాడట.. ఇలా చేయడం వల్ల వైసీపీకి టార్గెట్ కావడం జరగదనే ఆలోచనట.. ఇక బాబుతో నారాయణకు ఉన్న వ్యాపార లింకులు చూస్తే మతి పోవలసిందేనట. టీడీపీలో ఇంతటి పరపతి కలిగిన నారాయణ రాజకీయ నాయుకులెవర్నీ తన దగ్గరకు రానీయడంలేదట, రాజకీయా విషయాలు కూడా మాట్లాడ్డం తగ్గించేశారట. అలాగని బాబుతో టచ్‌లో లేడనుకుంటే పొరపాటేనండోయ్.. ఇదంతా సీక్రెట్ గా జరిగిపోతుందట.
ఇకపోతే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అన్నీ తానై నడిపిన ఆయన, ఇప్పుడు ప్రతిపక్షంలో మాత్రం పూర్తిగా సైలెంట్ కావడం కొందరికి ఆశ్చర్యం అనిపించిన ఇలా ఉండటం వల్ల వైసీపీ నేతలు కూడా ఆయన్ను పెద్దగా టార్గెట్ చేయలేదు. మిగతా సీనియర్ నాయకులంతా వైఎస్ జగన్ ని తిడుతూ.. వైసీపీ వాళ్లకు, వైసీపీ మీడియాకు టార్గెట్ అవుతుంటే. నారాయణ మాత్రం తన పని తాను చూసుకుంటున్నారట. ఇదే సమయంలో ఆయన వియ్యంకుడు గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి వెళ్తే, నారాయణకు ఇంకా హ్యాపీ. అందుకే నారాయణ అజ్ఞాతంలో ఉండి అదను కోసం ఎదురుచూస్తున్నారని అంటున్నారట విశ్లేషకులు..