రాజకీయాల్లో జరిగే రగడా నాయకులకు బోరు, చికాకు తెప్పించకపోవచ్చూ, కానీ ప్రజలు మాత్రం సహనం కోల్పోయేలా చేస్తుంటుంది.. ఎన్నికల్లో గెలిచి పాలన చేపట్టినాక ఏ నాయకుడైనా ప్రచారంలో ఇచ్చిన హమీలను నెరవేర్చడానికి వెనకా ముందు ఆలోచిస్తాడు.. ఏముంది అయిదు సంవత్సరాల వరకు మన ప్రభుత్వమే ఉంటుంది. మళ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలను మభ్యపెట్టో, కావాలంటే ఈ సారి పంచిన పైసల కంటే ఇంకాస్త ఎక్కువగా పంచో వారిని వంచన చేసి ఓట్లు వేయించుకోవచ్చని ఆలోచించని నాయకులు ఉండరు.. అందుకే మనదేశ రాజకీయాల్లో నాయకులు కోట్లకు పడగలెత్తితే వారికి ఓట్లేసి పదో పరకకో ఆశపడిన ఓటర్లు మాత్రం బిచ్చగాళ్లలా ఎప్పటికి అడుక్కుంటూనే ఉంటారు.. ఇది ఈ వ్యవస్దకు పట్టిన దరిద్రం అనక తప్పదు..
ఇకపోతే ఏపీ రాజకీయాలు చదరంగాన్నే తలపిస్తున్నాయి.. ఇక్కడి రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం సర్వసాధారణం అయిపోయింది.. ఒకరిపై ఒకరు చేసుకునే విమర్శలు వారి స్దాయిని దిగజార్చేలా ఉంటాయి అప్పుడప్పుడు.. కానీ అధికార పార్టీలో ఉన్న వారు ఎదుర్కొనే విమర్శ పట్ల బాధ్యతగా సమాధానం చెప్పవలసి ఉంటుంది.. ఇక ప్రతిపక్షం కూడా ప్రజా సమస్యలపైనే సవాల్ చేయాలి కానీ ఏపీ రాజకీయాల్లో కొందరు నాయకులు బాధ్యత మరచి ప్రవర్తించడం ఆ పార్టీ పరువు తీసినట్లు అవుతుందనే విషయాన్ని మరచిపోతున్నారట..
ప్రతిపక్షం అయిన టీడీపీ కూడా తాము చేసిన పాలన రామచంద్రుని పాలన అన్నట్లుగా, కంసుడి పాలన వైఎస్ జగన్ చేస్తున్నారన్నట్లుగా ప్రవర్తించడం.. ఇందుకు తగ్గట్తుగానే వైసీపీ నేతలు కౌంటర్స్ వేయడం, బూతులు మాట్లాడటం ఎక్కువగా వినిపిస్తుందట.. ఈ మధ్యకాలంలో అయితే వైసీపీ నేతలు ఎక్కువగా విమర్శల కంటే బూతులు మాట్లాడటానికే ఇష్టపడుతున్నట్లు కనిపిస్తోందనే ప్రచారం కూడా మొదలైంది.. ఇలాంటి ప్రవర్తన వల్ల పార్టీకే ఎక్కువ డ్యామేజ్ జరిగే అవకాశముందని తెలుస్తోంది.
ఇకపోతే గత కొంతకాలంగా మంత్రులతో సహ పలువురు నేతల విమర్శల్లో బూతులే ఎక్కువ వినిపిస్తున్నాయట. మరీ ముఖ్యంగా అమరావతి రైతులని ఉద్దేశించి తీవ్ర పదజాలంతో దూషిస్తున్నారు. ఇలా దూషించడాన్ని రాష్ట్రంలో ఇతర ప్రాంతాల వారు ఏ మాత్రం అంగీకరించడం లేదనే తెలుస్తోంది. ఇలా మాట్లాడటం వల్ల జగన్‌కే మైనస్ అవుతుందని తెలుస్తోంది.. వైఎస్ జగన్ ఇచ్చిన ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటు పార్టీ పునాదులు బలంగా చేస్తున్న సమయంలో వైసీపీ నేతలు పార్టీ పరువు, వైఎస్ జగన్ పరువు తీసేలా కాకుండా కాస్త సౌమ్యంగా మాట్లాడితే మంచిదంటున్నారట..