Y.S.Jagan Arrest: జూన్ 10లోగా వైయస్ జగన్ అరెస్ట్… డేట్ తో సహా బయట పెట్టిన సాయి రెడ్డి?

Y.S.Jagan Arrest: వైసీపీ పార్టీకి అధికారం పోయినప్పటి నుంచి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉన్నాయి. వరుసగా వైసీపీ నుంచి ఎంతోమంది కీలక నేతలు బయటకు వస్తున్నారు. అలాగే కొంతమంది పార్టీకి రాజీనామా చేసి ఎలాంటి రాజకీయాలలో పాల్గొనకుండా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇక వైసిపి పార్టీలో కొనసాగుతున్న వారిపై అక్రమ కేసులను పెడుతూ వారిని కూడా జైలుకు పంపిస్తున్న విషయం తెలిసిందే. ఇలా వైసిపి అధికారం కోల్పోయినప్పటి నుంచి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటుంది.

ఇకపోతే ప్రస్తుతం వైసీపీ నాయకులు, అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి లిక్కర్స్ స్కామ్ లో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈమధ్యం కుంభకోణంలో భాగంగా కొంతమందిని అరెస్టు చేసిన సిట్ అధికారులు వారి నుంచి కీలకమైన  ఆధారాలను కూడా సేకరించారని తెలుస్తుంది. ఈ ఆధారాలతో జగన్మోహన్ రెడ్డిని అదుపులోకి తీసుకొనే అవకాశాలు ఉన్నాయని గత కొద్ది రోజులుగా వార్తలు వినపడుతున్నాయి.

ఇలాంటి వార్తలు వస్తున్నా నేపథ్యంలో వైసీపీ మాజీ నాయకుడు విజయ్ సాయి రెడ్డి జగన్ అరెస్ట్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డికి కుడి భుజంగా ఉన్న విజయసాయిరెడ్డి ఉన్నఫలంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసారు. ఇలా బయటకు వచ్చిన ఈయన తెలుగుదేశం కీలక నేతలతో రహస్య భేటీ అవడంతో పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. అయితే ఈ విషయంపై ఈయన ఓపెన్ కామెంట్స్ చేశారు. నేను కలిసాను ఇప్పుడు తప్పేంటి అనవసరంగా నన్ను గెలికితే మీరే ఇబ్బందుల్లో పడతారు అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు.

ఇలాంటి తరుణంలోనే వైయస్ జగన్ జూన్ 10 లోపు అరెస్ట్ అవుతారంటూ విజయసాయిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపుతున్నాయి. మరి ఈ కేసులో భాగంగా జగన్ జైలుకు వెళ్లక తప్పదా అంటే తప్పదనే చెప్పాలి. మరోవైపు జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఎవరు వచ్చి అరెస్టు చేస్తారో చేయనివ్వండి అంటూ ధీమా వ్యక్తం చేశారు. మొత్తానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ గురించి తరచూ వార్తలు బయటకు వస్తున్నాయి.