జగన్ ఆ ఒక్క నిర్ణయం తీసుకోకూడదు అని నిద్ర కూడా మానేసి దేవుడికి మొక్కుకుంటున్న చంద్రబాబు .. !

 

రాజకీయాల్లో ముందు చూపు ఉండాలంటారు పెద్దలు.. ఇదే మాటను అక్షరాల ఆచరిస్తున్నాయి వైసీపీ, బీజేపీ.. ఇప్పటికే ఏ మాత్రం అవకాశం చిక్కినా తన పార్టీని బలోపేతం చేసుకుని తుప్పు పడుతున్న సైకిల్‌తో అధికారపక్షాన్ని, ప్రతిపక్షం చేయాలని భావిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు అంతర్గతంగా పార్టీ నాయకులను బుజ్జగించే పనిలో పడ్డారు.. పనిలో పనిగా బీజేపీతో మరోసారి కలిసిపోవాలని అన్ని దారుల్లో ప్రయత్నాలు చేస్తున్నాడు.. ఇదే సమయంలో కేంద్ర పెద్దలతో సఖ్యతగా ఉంటూ వస్తున్న వైఎస్ జగన్ తీరు బాబులో సహనాన్ని కోల్పోయేలా చేస్తుంది.. ఒకరకంగా 2024 నాటికి తన పరిస్దితి, పార్టీ పరిస్దితి ఊహించుకుంటూ ఎలాగైనా వైసీపీని దెబ్బతీయాలనే ఆలోచనలో ఉన్నాడంటున్నారు విశ్లేషకులు..

అయితే ఏపీలో మాత్రం వైసీపీ, బీజేపీ నాయకులు ఒకరి మీద ఒకరు కత్తులు నూరుకుంటున్నారు.. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ, రాజకీయంగా పైచేయి సాధించేందుకు పోటీపడుతున్నారు.. ఇక్కడే మరో రాజకీయ కోణం కనబడుతుంది.. అదేమంటే బీజేపీ కూడా ఏపీలో 2024 నాటికి అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తుంది.. దానికోసమే వైఎస్ జగన్‌ను తన గుప్పిట్లో పెట్టుకుని టీడీపీని మరింతగా అణగదొక్కాలని చూస్తుంది.. ఒకవేళ టీడీపీని ఎన్నికల రేసులో లేకుండా చేస్తే వైసీపీతో ఎలాగు పొత్తు ఉంది కదా అది చాలు తాము ఏపీలో బలపడటానికి అని ఆలోచన చేస్తున్నారట బీజేపీ పెద్దలు.. అందువల్ల బీజేపీ హడావుడి కొంత కాలంగా ఏపీలో ఎక్కువగా కనిపిస్తోందట.

ఇకపోతే సాధారణ ఎన్నికల్లో బీజేపీ గెలిచి కేంద్రంలో మోదీ అధికారంలోకి రావటానికి ముందు.. ఆ పార్టీ కేవలం ఏడు రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. అయితే.. 2018 మార్చి నాటికి బీజేపీ 21 రాష్ట్రాలకు తన అధికారాన్ని విస్తరించింది. అంతకు ముందు ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల సంఖ్యతో పోలిస్తే ఇది మూడు రెట్లు ఎక్కువ. ఇక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు పరంపరకు ముందు.. 2015లో జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి పీడీపీతో బీజేపీ చేతులు కలిపింది. ఆ ఎన్నికల్లో మొత్తం 87 సీట్లున్న అసెంబ్లీలో పీడీపీ 28 సీట్లు, బీజేపీ 25 సీట్లు, ఎన్‌సీ 15 సీట్లు, కాంగ్రెస్ 12 సీట్లు గెలిచిన క్రమంలో బీజేపీ, పీడీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అప్పుడు ఒక్క పంజాబ్ మినహా మొత్తం ఉత్తర భారతదేశమంతా మొదటిసారిగా బీజేపీ, దాని మిత్రపక్షాల పాలనలోకి వచ్చింది.. కానీ బీజేపీ ప్రస్తుత పరిస్థితి మాత్రం వేరేగా ఉంది..

ఈ మధ్యకాలంలో ఎన్డీయే నుంచి మిత్రపక్షాలు ఒక్కొక్కటి దూరమవుతుండటం, మరో వైపు రాజ్యసభలో పెద్దగా బలం లేకపోవడంతో, ఏదైనా ముఖ్యమైన బిల్లును ప్రవేశపెట్టే సమయంలో అనేక ఇబ్బందులు వస్తుండటంతో బీజేపీలో ఆందోళన మొదలైంది. ఇలాంటి క్లిష్ట పరిస్దితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ కి అండగా నిలబడుతూ, ఓటింగ్ లో తగిన సహకారం అందిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర బీజేపీ పెద్దలు వైసీపీని ఎన్డీయేలోకి ఆహ్వానిస్తున్నట్లు గా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ వైఎస్ జగన్ గనుక ఎన్డీయేలో చేరి మంత్రి పదవులు తీసుకుంటే విజయ్ సాయి రెడ్డితో పాటుగా, మరో ఎంపీకి కేబినెట్ లో మంత్రులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదీగాక ఏపీకి ఎదురవుతున్న కష్టాలన్ని దూరం అవుతాయి.. ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఇక నిధుల కొరత పెద్దగా ఉండదు.

ఇలా కేంద్రం అన్ని రకాలుగానూ సహాయం అందించడంతో పాటు, టీడీపీని నామరూపాలు లేకుండా చేసే విషయంలో కూడా బీజేపీ సహకారం అందిస్తుంది.. ఇది చాలదన్నట్లుగా టీడీపీ చేసిన అవినీతి పనుల విషయంలో వైసీపీ అన్ని ఆధారాలు సేకరించి చంద్రబాబు లోకేష్ తో పాటు, మరి కొంతమంది టీడీపీ నాయకులకు చుక్కలు చూపించేలా ప్లాన్ సిద్దం అవుతుందట.. ఇదే జరిగితే చంద్రబాబు రాజకీయ భవిష్యత్తు ఇరకాటంలో పడటం ఖాయం అంటున్నారు విశ్లేషకులు..