Dates Milk: పాలు, ఖర్జూరాలు మన శరీరానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు ఈ రెండింటిలో లభిస్తాయి. ఈ రెండింటిని విడిగా తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మనకు తెలుసు. అయితే ఈ రెండింటినీ కలిపి తినటం వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని మీకు తెలుసా. వీటిని కలిపి తినటం వల్ల పోషకాహార లోపం రాకుండా కాపాడుతుంది. ఒక గ్లాస్ పాలు తీసుకొని అందులో 4 కర్జురాలను వేసి దాదాపుగా నాలుగు గంటలు నానబెట్టాలి. తర్వాత ఆ పాలను వేడి చేసుకొని తాగాలి. ఇలా ఉదయం ఒక కప్పు, సాయంత్రం ఒక కప్పు తాగటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం….
• రక్తహీనత సమస్య తో బాధపడేవారు ఈ మిశ్రమాన్ని తాగడం వల్ల రక్తం ఎక్కువగా తయారవుతుంది. రక్త సరఫరా మెరుగుపడి, హైబీపీ సమస్య తగ్గుతుంది. ఫలితంగా గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
• అజీర్తితి, గ్యాస్, మలబద్దకం సమస్యలతో బాధపడేవారు ఈ మిశ్రమాన్ని తాగడం వల్ల ఎంతో మేలు చేకూరుతుంది. పాలు, కర్జూరం మిశ్రమాన్ని తాగడం వల్ల జీర్ణప్రక్రియ మెరుగుపడి, జీర్ణ వ్యవస్థ పనితీరు బాగా ఉంటుంది.
• కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాపులు సమస్యతో బాధపడేవారు ఈ మిశ్రమాన్ని రోజు తాగడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. ఆర్థరైటిస్ ఉన్నవారికి ఎంతో మేలు చకూరుతుంది. అలర్జి సమస్యలతో బాధపడే వారు ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల ఆ సమస్య నుండి బయట పడతారు.
–
• పాలు, కర్జురం మిశ్రమాన్ని తాగడం వలన పురుషులలో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. సంతాన సమస్యల నుండి బయట పడటానికి కూడా ఈ మిశ్రమం ఉపయోగపడుతుంది.
• చర్మంమం మీద మొటిమలు, మచ్చలు, వృద్ధాప్య సమస్యలు తగ్గించడంలో కూడా పాలు, కర్జురం మిశ్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది. చర్మాన్ని కాంతివంతం చేస్తుంది.
• చిన్నారులకు ఈ మిశ్రమాన్ని తాగించడం వల్ల వారి మెదడు చురుకుగా పని చేయడమే కాకుండా జ్ఞాపకశక్తి పెరుగుతుంది. వారు అన్ని రంగాలలో ముందుకు సాగుతారు.