World Series Season 2: మళ్ళీ బ్యాటు పట్టనున్న క్రికెట్ దిగ్గజాలు.. ఎందుకో తెలుసా..!

World Series Season 2: భారత మాజీ క్రికెట్ దిగ్గజాలు మళ్ళీ బ్యాట్ జులిపించనున్నారు. సచిన్, సెహ్వాగ్ వంటి లెజండరీ ప్లేయర్ల ఆటను చూడటానికి యావత్ క్రికెట్ ప్రేమికులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఆ అదృష్టం త్వరలోనే జరగనుంది. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ టీ 20 సీజన్ వచ్చే ఏడాదిలో జరగనుంది.

2022 రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ టీ 20 సీజన్2ను భారత్ తో పాటు, యూఏఈ వేదికగా నిర్వహించబోతున్నట్లు తెలియచేశారు టోర్నీ నిర్వాహకులు. ఫిబ్రవరి 5, 2022 నుంచి ప్రారంభమయ్యే సీజన్ 2 రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్… ఫ్రిబవరి 5 నుంచి జనవరి 31 వరకూ ఇండియాలో జరుగుతుంది. ఆ తర్వాత మార్చి 1 నుంచి 19 వరకూ యూఏఈ వేదికగా మ్యాచులు జరుగబోతున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా మొదటి సీజన్ వాయిదా పడి 2021 ఆరంభంలో లక్నో వేదికగా జరిగింది. అయితే రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ సీజన్ 1 సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ మ్యాచులు చూసేందుకు ప్రేక్షకులు వేలాదిగా తరలి వచ్చారు.

అయితే ఈ సిరీస్‌లో పాల్గొన్న తర్వాత భారత మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, ఇర్పాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, బ్రదీనాథ్ తదితర క్రికెటర్లు కరోనా బారిన పడ్డారు. దీంతో ఈ సారి రెండో సిజన్ ని ఎలా నిర్వహిస్తారనేది ఆసక్తికరంగా మారింది. మొదటి సీజన్‌ను సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీలోని టీమిండియా గెలిచిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా రోజూ వేల సంఖ్యలో ప్రజలు రోడ్డు ప్రమాదాలకి గురై ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. రోడ్డు భద్రతపై జనాల్లో అవగాహన కల్పించాలనే మంచి ఉద్దేశంతో ఈ సిరీస్‌ను నిర్వహిస్తున్నారు. ఈ మధ్యనే అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్, వచ్చే సీజన్‌లో రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ ఆడబోతున్నాడని సమాచారం.