టెక్నాలజీ ఇంత డెవలప్ అయినా కూడా ఇంకా కొన్ని ప్రదేశాలలో మూఢనమ్మకాలు వీడలేదు.ఈ మూఢనమ్మకాల వల్ల ఇప్పటికీ ఎన్నో ప్రాణాలు పోయాయి. అంతేకాకుండా ఈ మూఢనమ్మకాల వల్ల ఎంతో మంది జీవితాలు నాశనం అవుతున్న కూడా వాటిని విడిచి పెట్టడం లేదు. ముఖ్యంగా చూసుకుంటే మారుమూల పల్లెటూళ్లలో ఇలాంటి మూఢ నమ్మకాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సైన్స్ ఇంతగా అభివృద్ధి చెందిన కూడా సమాజంలో మూఢనమ్మకాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం లేదు.
అయితే చదువుకున్న వారు సైతం ఈ మూఢనమ్మకాలు అన్న ఊబిలో పడే వారి జీవితాలను నాశనం చేసుకుంటారు.తాజాగా కర్ణాటకలో ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. పార్వతి అనే ఒక 37 ఏళ్ల మహిళ తలనొప్పి ఎక్కువగా బాధ పడేది. దాదాపుగా రెండు నెలల నుంచి ఆమెను తలనొప్పి వేధిస్తోంది. ఈ క్రమంలోనే హాస్పిటల్ కి వెళితే అక్కడ డాక్టర్లు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. అయినప్పటికీ డాక్టర్లకు కూడా ఆ తల నొప్పి ఎందుకు వస్తుందో అర్థం కాలేదు.
ఈ క్రమంలోనే ఒక బంధువు ద్వారా బెక్క గ్రామంలో ఉన్న మను అనే ఒక 42 ఏళ్ల బాబా గురించి తెలియగానే తలనొప్పి కచ్చితంగా తగ్గిస్తాడు అనుకుని పార్వతిని బంధువులు పార్వతిని ఆ బాబా దగ్గరికి తీసుకెళ్లారు. ఆమె పరిస్థితి విన్న ఆ బాబా తలనొప్పి తగ్గిస్తారు అంటూ పార్వతి తలపై కర్రతో బలంగా కొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. దీంతో వెంటనే పార్వతిని అను బంధువులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. ఇదే విషయాన్ని పార్వతి కుమార్తె చైత్ర వెల్లడించింది. తన తల్లి ని చంపాడు అంటూ ఆ బాబా పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఆ బాబా పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.