Crime News: ఈ రోజుల్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగి చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. వాహనాలు నడిపే వారి అజాగ్రత్త వల్ల ఎదుటివారు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సిటీస్ లో ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. రూల్స్ పాటించకుండా ఎవరికీ తోచిన దారిలో వారు వెళ్ళటం వల్ల ఆక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఇటీవల ఇలాంటి సంఘటన ఒకటి విజయవాడలో చోటు చేసుకుంది.
వివరాలలోకి వెళితే.. మహిళ రాంగ్ రూట్లో వచ్చి బస్సు డ్రైవర్ మీద దాడి చేయడానికి ప్రయత్నించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విద్యాధరపురం డిపోనకు చెందిన ఐదో నంబర్ సాయంత్రం డిపో నుండి బయలుదేరింది. కాలేశ్వరరావు మార్కెట్ నుండి ఆటోనగర్ కు వెళ్లే దారిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే వెళ్లేదారిలో కృష్ణలంక ప్రాంతానికి చెందిన నందిని అనే యువతిని తన స్కూటీ మీద 1 వే లో కేఎల్ యూనివర్సిటీ టెన్షన్ జంక్షన్ వద్ద రూల్స్ అతిక్రమించి రాంగ్ రూట్ లో ఐదో నెంబర్ బస్సుకు అడ్డంగా వచ్చింది. దీంతో బస్సు డ్రైవర్ ముసలయ్య వెంటనే చాకచక్యంగా బ్రేక్ వేసి బస్సుని అదుపు చేసి ఆమె ప్రాణాలు కాపాడాడు.
ఈ పరిణామంతో ఆగ్రహించిన సదరు మహిళ ప్రాణాలు కాపాడిన డ్రైవర్ మీద దాడికి దిగింది. బస్సులోకి ప్రవేశించి మనుషులనీ చంపేస్తావా అంటూ ఆర్టీసీ డ్రైవర్ ని కాళ్లతో, చేతులతో దాడి చేసింది. తప్పు తన వైపు ఉన్నాకూడా ప్రాణాలు కాపాడినందుకు కృతజ్ఞత చూపించకుండా డ్రైవర్ పై దాడి చేయడంతో అక్కడున్న వారు సదరు మహిళలని నిందించారు. ఈ తతంగం అంతా అక్కడున్న ఒక మహిళ తన మొబైల్లో రికార్డు చేసింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించటంతో ఘటనా స్థలానికి చేరుకొని డ్రైవర్ పై దాడికి దిగిన మహిళలను అదుపులోకి తీసుకున్నారు.
ఫోన్ లో ఉన్న దృశ్యాలను ఆధారంగా చేసుకొని బస్సు డ్రైవర్ ఇచ్చిన కంప్లైంట్ తో సదరు మహిళ నీ అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.