ఈరోజుల్లో ప్రతి రాజకీయ పార్టీకి ఒక న్యూస్ ఛానల్, ఒక న్యూస్ పేపర్ ఉన్నాయి. తమ పార్టీ నేతలు చేస్తున్న పనులను కొండంత చేసి చూపించడం ఆ ఛానల్ మరియు పత్రికల పని. అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న జనసేన పార్టీకి ఎలాంటి న్యూస్ ఛానల్ కానీ పత్రికకాని లేకపోవడం వల్ల మీడియాలో పార్టీకి కవరేజ్ కరువైంది.
ఆ పార్టీ కార్యకర్తలు చేస్తున్న సేవ కార్యక్రమాలను కూడా ఇప్పుడున్న పొలిటికల్ అజెండా కలిగిన మీడియా పట్టించుకోవడం లేదు. కరోనా సమయంలో జనసేన కార్యకర్తలు చేస్తున్న సేవ కార్యక్రమాలను ఇప్పటి వరకు ఒక్క మీడియా కూడా వాటిని కవర్ చెయ్యలేదు. ఈ కరోనా కష్ట కాలంలో జనసేవ పేరుతో జనసేన కార్యకర్తలు ప్రజలకు సహాయం చేస్తున్నారు. కరోనా సమయంలో ప్లాస్మా అవసరం ఉన్నవారికి కూడా జనసేన సైనికులు సమాచారాన్ని షేర్ చేస్తూ, దాతలను తీసుకువస్తున్నారు.
ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాల్లో వరదల కారణంగా చాలా ప్రాంతాలు నీట మునిగితే, ముంపు బాధితుల్ని పరామర్శించడం, వారికి నిత్యావసర వస్తువులు అందజేయడంలో జనసైనికులు బిజీగా వున్నారు. కరోనా లాక్‌డౌన్ సమయంలోనూ జనసైనికులు, స్వచ్ఛందంగా రంగంలోకి దిగి, సొంత ఖర్చులతో పేదల్ని ఆదుకున్న విషయం కూడా మీడియాకెక్కకపోవడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, తెలంగాణలోనూ గత కొద్ది రోజులుగా వరదలు సంభవిస్తున్న నేపథ్యంలో అక్కడా జనసైనికులు, బాధితులకు ‘అండగా మేమున్నాం..’ అంటూ సాయమందిస్తున్నారు. మీడియా కవరేజ్ గురించి జనసైనికులను అడిగితే…తాము కానీ తమ నాయకుడు కానీ చేస్తున్న సేవ కార్యక్రమాలకు పబ్లిసిటీ కోరుకోమని, తాము ఈ కష్టకాలాన్ని మిగితా నాయకుల్లా తాము ఈ కష్టకాలాన్ని రాజకీయం చేయదలచుకోలేదని చెప్తున్నారు. మీడియా పట్టించుకున్నా, పట్టించుకోకపోయినా తాము చేస్తున్న సేవ కార్యక్రమాలను ఆపామని చెప్తున్నారు. రెండు రాష్ట్రాల్లో ఉన్న మీడియా మాత్రం ఒక ప్రణాళిక ప్రకారమే జనసేనకు తొక్కేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు