వైఎస్ జగన్ గెలిచినప్పుడు చిన్నవాడు, ఎలాంటి అనుభవం లేనివాడు ఏం చేస్తాడులే అంటూ ఎద్దేవా చేశారు చాలామంది. కానీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా అనూహ్య రీతిలో పనిచేసి చూపిస్తున్నారు. ఎవ్వరూ ఊహించని స్థాయిలో క్రేజ్ సొంత చేసుకుంటున్నారు. ముఖ్యంగా సంక్షేమ పథకాల అమలులో జేగా చూపిస్తున్న తెగువ అంతా ఇంతా కాదు. గతంలో ఏ ముఖ్యమంత్రికి సాధ్యకాని రీతిలో చేస్తున్నారు. వేళా కోట్లు ప్రజల ఖాతాల్లోకి మళ్లిస్తున్నారు. నవరత్నాల్లోని అన్ని పథకాలను అమలుచేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నారు. దీంతో జగన్ ప్రజల్లో మంచి పాపులారిటీని తెచ్చుకుంటున్నారు. అయితే ఈ ప్రయోజనాల వెనకే కష్టాలు కూడ ఉంటున్నాయి. ఈ కష్టాలు సొంత పార్టీ నుండే ఉండటం గమనార్హం.
జగన్ పూర్తిగా పాలనకు పరిమితమైపోవడంతో పార్టీ గాడి తప్పింది. నాయకుల మధ్యన సమన్వయం లోపించింది. ఒకరంటే ఒకరికి పొసగడం లేదు. ఒకే నియోజకవర్గంలో క్యాడర్ రెండుగా చీలిపోయింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవ్వరూ తగ్గట్లేదు. పైచేయి కోసం ఆధిపత్య పోరు నడుస్తూనే ఉంది. ఫలితంగా పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతోంది. మొదట్లో ఈ సూచనలు కనబడటంతో పార్టీ బాగోగుల కోసం విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, షహాల రామకృష్ణారెడ్డి లాంటి వారికి జిల్లాల వారిగా బాధ్యతలు ఇచ్చారు. వాళ్ళెంతో పనిచేస్తున్నా విబేధాలు మాత్రం ఆగడంలేదు. నిత్యం ఏదో ఒక గొడవతో హైకమాండ్ దృష్టిలో పడుతున్నారు. దీంతో జగన్ ఆలస్యం చేయకుండా పార్టీ మీద దృష్టి పెట్టాలని డిసైడ్ అయ్యారు. తనలాంటి నేత చేతుల్లోనే పాట్టీని పెట్టాలని భావిస్తున్నారు.
ఈ వెతుకులాటలో వైసీపీ నేతలకు జగన్ చెల్లెలు షర్మిల మంచి ఛాయిస్ లా కనిపిస్తున్నారట. ఎందుకంటే షర్మిలకు ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. జగన్ జైలుకెళ్ళినప్పుడు అంతా తానై పార్టీని నడిపారు. పర్యటనలు చేశారు. జనాన్ని పరామర్శించారు. ప్రత్యర్థుల మీద విమర్శలు గుప్పించడంలో కూడ షర్మిలకు ప్రత్యేక శైలి ఉంది. పార్టీలో ఆమెకు సహకరించిన నేతలు చాలామందే ఉన్నారు. ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి అనే లౌక్యం ఉంది. అందుకే తన ప్రతిరూపంగా షర్మిలను నిలిపి పార్టీ పగ్గాలను అప్పగించాలని చూస్తున్నారట. మరి ఈ వార్తలే గనుక నిజమైతే పార్టీని నడపడానికి షర్మిల మంచి ఛాయిసే అనాలి.