వైసీపీ కుల రాజకీయాలకు వేదిక కాబోతుందా ..?

Ys Jagan Vijaya Sai Reddy

   కులం కార్డు లేకుండా రాజకీయ పార్టీలు మనగడ సాగించటం ఈ రోజుల్లో చాలా కష్టమైన పని, తమ పార్టీకి అనుకూలమైన కులం పట్ల ఆయా పార్టీలు ఎప్పటికప్పుడు తమ విధేయతను ప్రదర్శిస్తూ ఉంటాయి, అదే సమయంలో ఇతర కులాలను చిన్నబుచ్చకుండా తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటాయి. అయితే వైసీపీ పార్టీ రాజకీయాలు, అందులోని నేతల మాటలు వింటే ఒక కులాన్ని టార్గెట్ చేసుకొని రాజకీయాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. మొదటి నుండి వైసీపీ మీద కమ్మ కుల వ్యతిరేకి అనే ముద్ర బలంగా వుంది. మీడియా కావచ్చు, మిగిలిన పార్టీలు కావచ్చు ఆ ప్రచారాన్ని బాగానే జనాల్లోకి తీసుకోని వెళ్లాయి. కాబట్టి దానిని చెరిపేసుకోవడానికి వైసీపీ ప్రయత్నాలు చేయకపోగా, వాటిని బలపరిచే విధంగా ముందుగు వెళ్తున్నట్లు తెలుస్తుంది. 

Ys Jagan Vijaya Sai Reddy

టీడీపీ కమ్మ కులస్తుల పార్టీ అనే ముద్ర వేయాలనే తపనతో తమ మీద తమకే తెలియకుండా కమ్మ కుల వ్యతిరేకి అనే ముద్ర వేసుకునే దిశగా ముందుకి వెళ్తుంది. తాజాగా బీజేపీ నాయకురాలు పురందేశ్వరిని ఉద్దేశించి వైసీపీ లో నెంబర్ 2 లీడర్ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం లేపుతున్నాయి. “జాతీ” నాయకురాలా..? “జాతి” నాయకురాలా ..? అంటూ విజయసాయి రెడ్డి మాట్లాడిన మాటలకు సొంత పార్టీలోనే వ్యతిరేకత వచ్చినట్లు సమాచారం. అమరావతికి అనుకూలంగా మాట్లాడితే చాలు వాళ్ళకి కుల రాజకీయం అంటగట్టడం వైసీపీ నేతలకు అలవాటైపోయిందనే మాటలు
సామాన్య స్థాయి ప్రజల్లో కూడా వినిపిస్తున్నాయి. ఇది కచ్చితంగా వైసీపీకి కీడు చేసే విషయమే.

  ఇప్పటికే తిరుమల తిరుపతి డిక్లరేషన్ విషయంలో హిందూ సమాజం నుండి వ్యతిరేకత వస్తుంది. కొందర దీనిని బహిరంగంగా వ్యతిరేకిస్తుంటే మరి కొందరిలో మాత్రం నివురుగప్పిన నిప్పుల వుంది. ఇలాంటి సమయంలో వైసీపీ పార్టీ ఇంకా జాగురతతో వ్యవహరించకపోగా, అహంపూరితమైన వ్యాఖ్యలు చేస్తుంది. గతంలో టీడీపీ పార్టీ కమ్మ కులస్తులకు మద్దత్తు ఇచ్చిన కానీ, మిగతా కులాల విషయంలో అనవరసమైన రచ్చ లేకుండా జాగ్రత్త పడుతూ ముందుకి నడించింది. వైసీపీ మాత్రం పబ్లిక్ గా ఒక కులాన్ని టార్గెట్ చేయటం సృష్టంగా కనిపిస్తుంది. ఇది ప్రజల్లోనే కాదు సొంత పార్టీలో ఆ కులం నేతలకు కూడా చాలా ఇబ్బందిగానే ఉంటుంది, కాకపోతే అధికారం ఉండబట్టి వాళ్ళు కుక్కినపేనులా సైలెంట్ గా వుంటున్నారు … ఈ రకమైన ధోరణిలు పార్టీ భవిష్యత్తుకు అంత మంచివి కాదు…కాబట్టి వైసీపీ కులం కార్డు ఉపయోగించే విషయంలో ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకుంటే మంచిది.