విడదల రజినీపై కుట్ర జరుగుతుందా..? సొంత నేతల పనేనా ..?

vidadala rajini telugu rajyam

 వైసీపీ పార్టీలో ప్రజాదరణ కలిగిన మహిళా నేతల్లో చిలకలూరి పేట ఎమ్మెల్యే విడదల రజిని ఒకరు. గతంలో టీడీపీలో రాజకీయం చేసిన ఆమె, ఆ తర్వాత వైసీపీ లోకి చేరి మొన్నటి ఎన్నికల్లో చిలకలూరి పేట నుండి ఎమ్మెల్యే గా విజయం సాధించింది. సోషల్ మీడియాలో ప్రత్యేకమైన ఫాలోయింగ్ కలిగిన ఈమె పై పోలీస్ శాఖకు చెందిన ఇద్దరు ఉన్నత అధికారులు నిఘా వేసినట్లు తెలుస్తుంది. ఆమె ఫోన్ కాల్స్ , ఆమె పీఏ ఫోన్స్ పై నిఘా వేసినట్లు విడదల రజినీకి సృష్టమైన సమాచారం వచ్చింది.

vidadala rajini telugu rajyam

 

 దీనితో వెంటనే ఆమె సీఎంవో కార్యాలయానికి తెలియచేయటమే కాకుండా, వైసీపీ లో నెంబర్ 2 లీడర్, షాడో సీఎం గా పేరుగాంచిన నేతకు చెప్పటం జరిగింది. దీనితో రాత్రికి రాత్రే ఒక డీఎస్పీ ని, ఒక ఎసైని వీఆర్ కు పంపినట్లు తెలుస్తుంది. పోలీస్ శాఖకు చెందిన వాళ్ళు మహిళా ఎమ్మెల్యే మీద నిఘా వేయాల్సిన అవసరం ఏమి వచ్చింది. పైనుండి ఆదేశాలు వస్తే తప్ప అంత దైర్యం పోలీసులు చేయరు. ప్రతిపక్షం లోని నేతల మాటలు విని అధికారపక్షము నేతల మీద నిఘా పెట్టే ఛాన్స్ లేదు. కాబట్టి అధికార పార్టీలోని నేతలే ఆమె మీద నిఘా పెట్టించే అవకాశం వుంది. జగన్ తన మంత్రి వర్గ సభ్యుల పదవి కాలం కేవలం రెండున్నరేళ్లు మాత్రమే అని చెప్పటంతో, ఈ ధపా మంత్రి వర్గ విస్తీరణలో రజినీకి మంత్రి పదవి ఖాయమనే మాటలు వినవస్తున్నాయి.

  ఆమెకు మంత్రి పదవి రాకుండానే ఉద్దేశ్యంతోనే సొంత పార్టీ నేతలే ఇలాంటి పనులు చేపించారనే అనుమానాలు వస్తున్నాయి. చిలకలూరి పేట పార్లమెంట్ సభ్యుడు శ్రీకృష్ణ దేవరాయలు స్థానిక ఎమ్మెల్యే అయినా రజినీకి మధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమనే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తుంది. ఆమెకు మంత్రి పదవి వస్తే, స్థానికంగా అతని హవా తగ్గిపోతుందనే భయం శ్రీకృష్ణ దేవరాయాకు బాగా ఉందని, అందుకే తనకు అనుకూలంగా ఉండే పోలీసులతో రజిని మీద నిఘా పెట్టించాడని విడదల రజిని అనుచరవర్గం ఆరోపిస్తుంది. అయితే ఈ విషయాన్నీ ఎమ్మెల్యే రజిని అంత ఈజీగా వదిలిపెట్టే ఉద్దేశ్యంలో లేన్నట్లు తెలుస్తుంది. దీనిని సీఎం జగన్ దృష్టికి ప్రత్యేకంగా తీసుకొనివెళ్ళి అందుకు బాద్యులైన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నట్లు తెలుస్తుంది. ఈ వివాదంలో ఎంపీ శ్రీకృష్ణ దేవరాయ పేరు ప్రముఖంగా వినిపించటంపై ఆయన ఏమని సమాధానం చెపుతాడో చూడాలి.