ఏపీ సీఎం వైఎస్ జగన్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు అందరికీ షాకిస్తున్నాయి. ఈ నెల 11వ తేదీ నుంచి ఏపీలో జగనన్న స్టిక్కర్ల పంపిణీ ప్రక్రియ జరగనుంది. “మా నమ్మకం నువ్వే జగన్” అని ముద్రించి ఉన్న స్టిక్కర్లను పంపిణీ చేయనున్నారు. గ్రామ, వార్డ్ వాలంటీర్లు ఈ స్టిక్కర్లను అంటిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ స్టిక్కర్లకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే ఈ విధంగా స్టిక్కర్లు అంటించడం విషయంలో ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే మాత్రం జగన్ కు మరో భారీ షాక్ తగిలే అవకాశాలు అయితే ఉన్నాయని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. జగన్ సర్కార్ కు హైకోర్టులో మొట్టికాయలు కొత్త కాదు. మరో వివాదం దిశగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. జగన్ కు ఏపీలోని ప్రజల్లో చాలామంది అభిమానులు అనే సంగతి తెలిసిందే.
సీఎం జగన్ ఇతర పార్టీల నేతలు విమర్శలు చేసే అవకాశం ఎందుకు ఇస్తున్నారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఎంతోమంది సీఎంలు ఉన్నా ఈ తరహా నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రులు అయితే లేరని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. స్టిక్కర్ల ద్వారా వైసీపీ పరువు పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
ఈ స్టిక్కర్లపై వైసీపీ అభిమానులలో కొంతమంది నుంచి నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి. స్టిక్కర్లు అంటించినంత మాత్రాన వాళ్లు వైసీపీకే ఓటు వేస్తారని చెప్పలేమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం జగన్ కు ఇలాంటి సలహాలు ఎవరు ఇస్తారో తెలీదు కానీ వాళ్లు మహానుభావులు అని కొంతమంది వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు.