ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం వెనుక ఏదో కుట్ర ఉందని చాలామంది భావిస్తారనే సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ వెనుక కూడా కుట్రలు జరుగుతున్నాయనే కామెంట్లు జోరుగా వినిపిస్తుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. జగన్ వల్ల తమ పార్టీ అధికారంలోకి రావడం సాధ్యం కావడం లేదని కొంతమంది భావిస్తున్న సంగతి తెలిసిందే.
ఏపీ సీఎం వైఎస్ జగన్ తన భద్రత గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జగన్ ఢిల్లీకి వెళ్లాలని భావించగా స్పెషల్ ఫ్లెయిట్ కు సంబంధించి భద్రతా లోపాలు తలెత్తడం గమనార్హం. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి సీఎం జగన్ విచారణకు ఆదేశించారు. ఫ్లెయిట్ లో సాంకేతిక లోపం వెనుక ఏదైనా కుట్ర ఉందని తేలితే మాత్రం జగన్ మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు.
ఆ తర్వాత జగన్ మరో ఫ్లెయిట్ లో ఢిల్లీకి వెళ్లడం జరిగింది. ఎయిర్ పోర్ట్ డైరెక్టర్లు మాత్రం ఎలాంటి కుట్ర జరగలేదని వాళ్లు చెబుతున్నారు. వైసీపీ నేతలు మాత్రం ఈ కుట్ర వెనుక కారణాలు తేల్చాలని కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు విమానాలలో సాంకేతిక సమస్యలు కామన్ అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. జగన్ పొలిటికల్ గా మరింత సక్సెస్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఏపీలో పొత్తులు లేకపోతే వైసీపీకే అనుకూలంగా ఫలితాలు వస్తాయని సర్వేలు తేల్చి చెబుతున్నాయి. 2024 ఎన్నికల్లో జనసేన పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు అయితే లేవని కామెంట్లు వినిపిస్తున్నాయి. సీఎం జగన్ అప్పులతో రాష్ట్రాన్ని నడిపిస్తుండగా రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం అంతకంతకూ పెరుగుతోంది.