ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం పదుల సంఖ్యలో స్కీమ్స్ అమలవుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయని స్థాయిలో జగన్ సర్కార్ పథకాలను అమలు చేస్తోంది. అయితే జగన్ సర్కార్ ఈ స్థాయిలో ఏ విధంగా పథకాలను అమలు చేస్తోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే జగన్ తాజాగా చంద్రబాబుపై ముసలాయన అంటూ కామెంట్లు చేయడం గమనార్హం.
తమ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిందని గత ప్రభుత్వం ఈ స్థాయిలో పథకాలను అమలు చేయలేదని జగన్ ప్రశ్నించారు. గత ప్రభుత్వంతో పోల్చి చూస్తే తమ ప్రభుత్వం చేసిన అప్పులు తక్కువేనని జగన్ ఆన్నారు. చంద్రబాబు నాయుడు బటన్ నొక్కి పథకాలను ఎందుకు అమలు చేయలేకపోయారని సీఎం జగన్ ప్రశ్నించడం గమనార్హం. అప్పుడూ ఇప్పుడూ బడ్జెట్ రాష్ట్రం ఒకటేనని జగన్ తెలిపారు.
గత ప్రభుత్వం తెచ్చిన అప్పులతో ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. సింగిల్ సింగిల్ గా వస్తుందని రాష్ట్రంలో తోడేళ్లు అన్నీ ఒకటి అవుతున్నాయని జగన్ కామెంట్లు చేశారు. తాను ప్రజలను దేవుడిని నమ్ముకున్నానని జగన్ వెల్లడించారు. చంద్రబాబు ముసలాయన అంటూ జగన్ వేసిన సెటైర్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. అయితే జగన్ చేసిన కామెంట్లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సీఎం జగన్ చేసిన విమర్శల గురించి చంద్రబాబు నాయుడు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. జగన్ రాబోయే ఏడాదిలో ఎంత అభివృద్ధి చేస్తారో చూడాల్సి ఉంది. జగన్ ప్రజలకు అభివృద్ధి జరిగేలా అడుగులు వేయాల్సి ఉందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.