అచ్చెన్నాయుడు లాగానే రాత్రికి రాత్రి దేవినేని ఉమాని కూడా ?

DeviNeni Uma TDP

 వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఒక పక్క ప్రజా సంక్షేమ పధకాలు అమలుచేస్తూ ప్రజా ప్రభుత్వం అనే బలమైన ముద్ర కోసం అడుగులు వేస్తూనే మరోపక్క టీడీపీ పార్టీని బలహీన పరిచే కార్యక్రమం కూడా చేస్తుంది. ఇందులో భాగంగా టీడీపీ లో గట్టిగా వాయిస్ వినిపించే నేతలను టార్గెట్ చేయటం, టీడీపీ యొక్క ఆర్థిక శక్తులను దెబ్బకొట్టటం, ఈ రెండు పనులను వైసీపీ సర్కార్ ఒక పద్దతి ప్రకారం అమలుచేస్తుందని అర్ధం అవుతుంది.

devineni uma

ప్రస్తుతం ఏపీ టీపీడీ అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్న అచ్చెన్న నాయుడు పై ఈఎస్ఐ కుంభకోణం కేసు నమోదు చేసింది. దాదాపు మూడు నెలలు అచ్చెన్నాయుడు జైలులో ఉన్నారు. ఆ తర్వాత ఒక హత్య కేసులో మాజీ మంత్రి కొల్లురవీంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత టీడీపీ యొక్క ఆర్థిక మూలలపై దృష్టి పెట్టిన వైసీపీ సర్కార్ మాజీ ఎంపీ సబ్బం హరి ప్రభుత్వ భూమిని ఆక్రమించారంటూ ఆయన ప్రహరీ గోడను కూల్చి వేశారు. మరోసారి ఆయనకు నోటీసులు జారీచేశారు. ఇక చంద్రబాబు బంధువు శ్రీభరత్ కు చెందిన గీతం కళాశాలలో ఆక్రమణలను కూల్చివేశారు. కేవలం అంతటిదో ఆగకుండా ఏకంగా ఆ యూనివర్సిటీ సభ్యత్వాన్ని రద్దు చేసే విధంగా పావులు కదుపుతున్నారు, ఈ క్రమంలోనే మరికొందరు టీడీపీ నేతల యొక్క వ్యాపారాలపై కేసులు నమోదు చేయటంతో ఆయా నేతలు టీడీపీ కి రాజీనామా చేసి,వైసీపీ తీర్థం పుచ్చుకున్నారని సమాచారం.

ఇక తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు టీడీపీలో మరో ఫైర్ బ్రాండ్ లీడర్ వైసీపీ మీద గట్టి విమర్శలు చేసే దేవినేని ఉమా మీద వైసీపీ ఫోకస్ పడినట్లు తెలుస్తుంది. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కృష్ణా పుష్కరాల ఘాట్ నిర్మాణపనుల్లో జరిగిన అవినీతి పనులపై ఇప్పటికే కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ నివేదిక అందిన వెంటనే దేవినేని ఉమపై కేసు నమోదు చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

 ఇదే కనుక జరిగితే టీడీపీ వాయిస్ గట్టిగా వినిపించే ఉమా నోటికి తాళాలు పడినట్లే అనుకోవాలి. ఇప్పటికే టీడీపీ ఫైర్ బ్రాండ్ లీడర్స్ వైసీపీ మీద ఆరోపణలు చేయాలంటే భయపడుతున్న పరిస్థితి నెలకొని వుంది. జైలుకు వెళ్ళిరాక ముందు వైసీపీ మీద విరుచుకుపడే అచ్చెన్ననాయుడు జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత మౌనం వహిస్తున్నాడు, కొలు రవీంద్ర కూడా ప్రభుత్వం మీద విమర్శలు చేటానికి వెనకడుగు వేస్తున్నాడు. ఇప్పుడు దేవినేని ఉమాకు కూడా అదే పరిస్థితి రావచ్చేమో అనే అనుమానులు వ్యక్తం అవుతున్నాయి.