Tablets: టాబ్లెట్స్ వేసుకునే సమయంలో ఎన్ని నీళ్లు తాగాలో తెలుసా?

Tablets: ప్రస్తుత కాలంలో వాతావరణంలో మార్పులు వల్ల , మారుతున్న ఆహారపు అలవాట్లు వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఎటువంటి ఆరోగ్య సమస్య వచ్చినా డాక్టర్ ను సంప్రదించి మందులు వాడటం అందరి అలవాటైపోయింది. ఇలా మందులు వాడటం వల్ల మన ఆరోగ్యం కుదుటపడుతుంది. డాక్టర్లు సిఫార్సు చేసే మందులు మూడు రకాలుగా మనకు లభ్యమవుతాయి. టాబ్లెట్స్, క్యాప్సుల్స్, టానిక్ రూపంలో ఉంటాయి. డాక్టర్ దగ్గరకి వెళ్ళినప్పుడు డాక్టర్ కూడా టాబ్లెట్స్ రూపంలో మందులు రాస్తుంటారు. కొంతమంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ప్రతి రోజు క్రమం తప్పకుండా మందులు వాడుతుంటారు. అయితే టాబ్లెట్స్ లేదా క్యాప్సుల్స్ వేసుకునేటపుడు కచ్చితంగా నీటిని తాగుతారు.

టాబ్లెట్స్ వేసుకునేటపుడు ఎంత మోతాదులో నీటిని తాగాలి. ఎక్కువ తాగితే ఏమవుతుంది, తక్కువ తాగితే ఏమవుతుంది అని ఒక సారి లుక్ వేద్దాం. టాబ్లెట్స్ లేదా క్యాప్సుల్స్ నీటిని తాగకుండా వేసుకుంటే అది గొంతులో ఇరుక్కుంటే చాలా ప్రమాదం, ప్రాణాపాయం పరిస్థితులు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. అందుకే నీటిని అస్సలు తాగకపోతే చాలా ప్రమాదం .చాలామంది టాబ్లెట్ వేసుకున్న తర్వాత తక్కువ మోతాదులో మీరు తాగడం వల్ల టాబ్లెట్ పూర్తి స్థాయిలో కరగక దాని ప్రభావం పూర్తిస్థాయిలో ఉండదు. అందుకని డాక్టర్స్ కూడా టాబ్లెట్స్ వేసుకునేటపుడు కచ్చితంగా నీటిని తాగమని చెపుతారు.

టాబ్లెట్ వేసుకున్నాక ఒక పూర్తి గ్లాస్ నీటిని తాగడం వల్ల టాబ్లెట్ పూర్తిగా కరిగి మంచి ఫలితం ఇస్తుంది. నీటిని తక్కువ తాగితే టాబ్లెట్ కరగదు. టాబ్లెట్స్ ఎన్ని ఉన్నా సరే ఒక గ్లాస్ నీటిని తాగితే సరిపోతుంది. గది ఉష్ణోగ్రత లో ఉండే నీటిని తాగడం వల్ల టాబ్లెట్ త్వరగా కరిగి ప్రభావం చూపుతుంది. చాలామంది టాబ్లెట్స్ వేసుకునే సమయంలో చల్లని నీరు తాగుతుంటారు.. ఇలా చేయడం వల్ల చల్లని నీరు శరీరంలోకి వెళ్లిన తర్వాత వేడిగా మారటానికి శరీరం నుండి ఎక్కువ శక్తి ఉపయోగించవలసి ఉంటుంది. చల్లని నీటిలో టాబ్లెట్ తొందరగా జీర్ణంకాక దాని నుండి సరైన ఫలితం లభించదు. అందుకే గోరువెచ్చని నీటితో టాబ్లెట్ వేసుకోవడం మంచి ఫలితాలను ఇస్తుంది.