ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలామంది థైరాయిడ్ సమస్యతో బాధ పడుతున్నారు. గర్భిణీ మహిళల్లో చాలామందిని ఈ సమస్య వేధిస్తోంది. కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా థైరాయిడ్ సమస్యకు చెక్ పెట్టే అవకాశాలు ఉంటాయి. సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా థైరాయిడ్ పనితీరు మెరుగుపడుతుంది. ఒత్తిడి వల్ల కూడా థైరాయిడ్ అసమతుల్యత ఏర్పడి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
రాత్రి సమయంలో సరైన నిద్ర ఉంటే థైరాయిడ్ పని తీరు మెరుగుపడే అవకాశాలు ఉంటాయి. ఆర్గానిక్ ఫుడ్, ఫిల్టర్ వాటర్ ను తీసుకోవడం ద్వారా కూడా థైరాయిడ్ సమస్యను దూరం చేసుకోవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా జీవక్రియ పనితీరు మెరుగుపడే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. థైరాయిడ్ రోగులకు షుగర్ ఉంటే ఆ సమస్య మరింత తీవ్రమయ్యే ఛాన్స్ ఉంటుంది.
సోయా మిల్క్, సోయాబీన్ లాంటి ఉత్పత్తులకు థైరాయిడ్ తో బాధ పడేవాళ్లు దూరంగా ఉంటే మంచిది. బ్రోకలీ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ తీసుకోవడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పవచ్చు. భారతదేశంలో దాదాపు 42 మిలియన్ల మంది ప్రజలు థైరాయిడ్ సమస్యతో బాధ పడుతున్నారని సర్వేల లెక్కలు చెబుతుండటం గమనార్హం.
రీరంలో హార్మోన్లను ఉత్పత్తి చేసే ఈ గ్రంథి పనితీరు దెబ్బతింటే హార్మోన్ల అసమతుల్యత ఏర్పడే అవకాశాలు అయితే ఉంటాయి. థైరాయిడ్ సమస్య వల్ల బరువు పెరగడం లేదా తగ్గడం, జుట్టు రాలడం, అలసట, నెలసరి సక్రమంగా రాకపోవడం, గర్భం దాల్చకపోవడం లాంటి సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఈ చిట్కాలు పాటించినా ఫలితం లేకపోతే వైద్యులను సంప్రదిస్తే మంచిది.