థైరాయిడ్ సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టాలా.. ఈ చిట్కాలు కచ్చితంగా పాటించాల్సిందే!

థైరాయిడ్ గ్రంథి అనేది ఎండోక్రైన్ గ్రంథి, ఇది మెడలో ఉంటుంది. ఇది జీవక్రియను నియంత్రించే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. థైరాయిడ్ గ్రంథి తగినంత హార్మోన్లను ఉత్పత్తి చేయలేకపోతే హైపోథైరాయిడిజం మరియు ఎక్కువ హార్మోన్లను ఉత్పత్తి చేస్తే హైపర్ థైరాయిడిజం అనే వ్యాధులు వస్తాయి. థైరాయిడ్ గ్రంథి జీవక్రియను నియంత్రిస్తుంది, పెరుగుదల మరియు అభివృద్ధికి సహాయపడుతుంది, శరీరం యొక్క శక్తిని ఉపయోగించడంలో సహాయపడుతుంది.

హైపో థైరాయిడిజం సమస్యతో బాధ పడేవారిలో అలసట, బరువు పెరగడం, చర్మం పొడిబారడం, నిద్రలేమి, మలబద్ధకం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. హైపర్ థైరాయిడిజంలో బరువు తగ్గడం, గుండె వేగం పెరగడం, ఆందోళన, జుట్టు రాలడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి అయోడిన్ అవసరం, కాబట్టి దీని లోపం వల్ల థైరాయిడ్ సమస్యలు వస్తాయి.

థైరాయిడ్ గ్రంథికి సంబంధించిన గడ్డలు, థైరాయిడ్ క్యాన్సర్, కొన్ని మందులు కూడా ఈ సమస్యకు కారణమవుతాయి. రక్త పరీక్షలు, రేడియోధార్మిక అయోడిన్ స్కాన్, అల్ట్రాసౌండ్ ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. థైరాయిడ్ హార్మోన్ మందులు వాడటం ద్వారా ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. యాంటీ థైరాయిడ్ మందులు వాడటం, శస్త్రచికిత్స ద్వారా హైపర్ థైరాయిడిజం సమస్యకు చికిత్స చేయవచ్చు.

పురుషులతో పోలిస్తే మహిళల్లో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపించే అవకాశాలు అయితే ఉంటాయి. నిద్ర సంబంధిత సమస్యలు ఉన్నవాళ్లు, మూడ్ స్వింగ్స్ ఎకువగా ఉన్నవాళ్లు ఒకసారి థైరాయిడ్ పరీక్ష చేయించుకుంటే మంచిది. ఆహారపు అలవాట్లలో మార్పులు చేయడం వల్ల థైరాయిడ్ సమస్యను కూడా కంట్రోల్ లో ఉంచుకోవచ్చు.