మనలో చాలామంది ఏదో ఒక సందర్భంలో పాదాల వాపు సమస్య వల్ల ఇబ్బందులు పడే ఉంటారు. రాత్రంతా బస్ లో కూర్చుని ప్రయాణం చేసినా, నిలబడి ఎక్కువ సేపు పని చేసినా పాదాలు వాయడం జరుగుతుందని చెప్పవచ్చు. కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ సమస్య వేధిస్తుంటే మొదట పాదాలు కొంచెం ఎత్తులో పెట్టుకోవడం చేయాలి.
ఈ విధంగా చేయడం ద్వారా బ్లడ్ ఫ్లో సరిగ్గా ఉండి వాపు తగ్గే అవకాశాలు ఉంటాయి. విశ్రాంతి తీసుకుంటున్నా పాదాలు కాసేపు కుషన్ మీద పెట్టుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. ప్రతి 30 నిమిషాలకు ఒకసారి బ్రేక్ తీసుకుని కూర్చోవడం ద్వారా పాదాల వాపు రక్త ప్రసరణ సమస్యలకు చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. శరీరానికి కావలసినంత నీరు మనం ఇవ్వకపోతే అది ఉన్న నీటిని వినియోగించుకునే ఛాన్స్ ఉంటుంది.
ప్రతిరోజూ కనీసం 8 గ్లాసుల నీరు తాగడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుతుంది. పాదాలు ఉప్పు నీటిలో కాసేపు ఉంచడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఎప్సం సాల్ట్ మజిల్ పెయిన్ నీ, ఇంఫ్లమేషన్ నీ, స్వెల్లింగ్ ను తగ్గించదంలో తోడ్పడుతుంది. మెగ్నీషియం డెఫిషియన్సీ ఉంటే కూడా పాదాల వాపు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
బ్రకోలీ, జీడి పప్పు, బాదం పప్పు, అవకాడో, డార్క్ ఛాక్లేట్, తోఫూ, పాల కూర తీసుకోవడం ద్వారా పాదాల వాపు సమస్య సులువుగా దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. పాదాల వాపు సమస్య చిన్న సమస్యలా అనిపించినా ఈ సమస్య వల్ల దీర్ఘ కాలంలో ఎదురయ్యే ఇబ్బందులు అన్నీఇన్నీ కావని చెప్పవచ్చు.