ఈసారైనా బుచ్చయ్య కోరిక తీరేనా..?

butchiah cbn telugu rajyam

 టీడీపీ పార్టీలో పొలిట్ బ్యూరో కమిటీ పదవి అనేది చాలా గౌరవంగా భావిస్తారు. పార్టీలో కీలకమైన నేతలకు అందులో అవకాశం ఉంటుంది. పార్టీకి సంబంధించిన కీలక నిర్ణయాలు అన్ని ఈ కమిటీనే చూసుకుంటుంది. అలాంటి కమిటీలో పనిచేయాలనే కోరిక టీడీపీలోని కీలక నేతలకు ఉంటుంది. 16 మంది సభ్యులు కలిగిన ఈ కమిటీలో తాజాగా గల్లా అరుణకుమారి రాజీనామా చేసి వెళ్ళిపోయింది. ఆమె చిత్తూరుకు చెందిన నేత. అదే జిల్లా నుండి గల్లా జయదేవ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ ఈ కమిటీలో వున్నారు. అందులోను ఒకే ఫ్యామిలీ నుండి ఇద్దరు ఉండటం కరెక్ట్ కాదనే అభిప్రాయాలు కూడా రావటం, దానికి తోడు వ్యక్తిగతమైన పనుల నేపథ్యంలో గల్లా అరుణ రాజీనామా చేసిందని చెపుతున్నారు.

Tdp Telugu Rajyam

 

  ఈ కమిటీలో రీసెంట్ గా వర్ల రామయ్యకు అవకాశం ఇచ్చాడు చంద్రబాబు. ఆయన తర్వాత కాల్వ శ్రీనివాస్ రెడ్డి కి కూడా అవకాశం రాబోతుందనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ కమిటీ ఏర్పడిన నాటినుండి నేటి వరకు యనమల, కేఈ, అయ్యన్న పాత్రుడు, అశోక్ గజపతి రాజు లు కొనసాగుతూనే వున్నారు, మరో సీనియర్ నేత రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి మాత్రం ఇంత వరకు అవకాశం రాలేదు. తనతోటి వారందరు ఈ కమిటీలో సభ్యులు అయ్యారు. తన తర్వాత పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా సభ్యులు అయ్యారు, కానీ బుచ్చయ్య కు మాత్రం ఆ ఛాన్స్ ఇవ్వలేదు చంద్రబాబు .

  తాజాగా మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో పొలిట్ బ్యూరో కమిటీలో మరో కమ్మ నేతకు అవకాశం ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆ కోటాలో ఈసారైనా బుచ్చయ్య చౌదరికి స్థానం దక్కే ఛాన్స్ ఉందని టీడీపీలో మాటలు వినవస్తున్నాయి. ఈ పదవి కోసం పయ్యావుల కేశవ్ , దూళ్ళిపాళ్ల నరేంద్ర కూడా పోటీ పడుతున్నట్లు సమాచారం, అయితే సీనియారిటీ ప్రకారం చూస్తే బుచ్చయ్య చౌదరికి ఎక్కువ అవకాశం వుంది. ప్రస్తుతం పార్టీలో కీలకంగా పనిచేస్తు, పార్టీ తరుపున వాయిస్ ను గట్టిగా వినిపిస్తున్న బుచ్చయ్య చౌదరికే ఈ పదవి రావటం ఖాయమని తెలుస్తుంది. అయితే పార్టీలో ఈ పదవి విషయంలో ఎలాంటి వివాదాలు లేకుండా స్మూత్ గా డీల్ చేయాలనీ బాబు ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.