YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవారికి ఉచితంగా వైద్య అందించే ఆరోగ్య శ్రీ పథకాన్ని రద్దు చేసిన విషయం మనకు తెలిసిందే గత ప్రభుత్వ హయామంలో ఆసుపత్రులకు సుమారు 3000 కోట్ల వరకు బకాయిలు ఉన్న నేపథ్యంలో ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించిన సేవలను రద్దు చేశారు. ఈ క్రమంలోనే వైయస్ షర్మిల స్పందించారు.
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు పేదవారికి వైద్యం అందక చనిపోకూడదన్న ఉద్దేశంతో ఒక మంచి కార్యానికి శ్రీకారం చుడుతూ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేశారు అయితే కూటమి ప్రభుత్వం మాత్రం ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని కాస్త కూటమి ప్రభుత్వం అనారోగ్య శ్రీ పథకంగా మార్చేసిందని షర్మిల మండిపడ్డారు. పేదవాడి ఆరోగ్యానికి భరోసా ఇచ్చే ఆరోగ్యశ్రీ పథకాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది.
ఆరోగ్యశ్రీ పథకం అంటే ప్రాణాలతో పోరాటం చేస్తున్న పేద ప్రజలకు ఒక సంజీవని అని తెలిపారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకాన్ని ఆపి వేస్తూ పేదవారి ఆరోగ్యంతో ఆటలాడటం సరైనది కాదు పేదవారి ఆరోగ్యమంటే కూటమి ప్రభుత్వానికి లెక్క లేదా అంటూ ఈమె ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం రూ. 3 వేల కోట్ల బకాయిలు చెల్లించకుండా, వైద్య సేవలు నిలిపివేచే వరకు చూస్తున్నదంటే, ఈ పథకాన్ని నిర్వీర్యం చేయాలనే ఒక కుట్ర అని మాత్రమే చూడవచ్చు.
గత ప్రభుత్వ హయామంలో బకాయిలు ఉన్నటువంటి ఈ మూడు వేల కోట్ల రూపాయలను తక్షణమే చెల్లించి ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగించాలని షర్మిల డిమాండ్ చేశారు. ఎంతో బృహత్తరమైన ఈ ఆరోగ్యశ్రీ పథకానికి ఏ విధమైనటువంటి లోటు రాకుండా చూసుకోవడం ప్రభుత్వ బాధ్యత అంటూ షర్మిల తెలిపారు.