రఘురామకృష్ణరాజుని వైఎస్సార్సీపీ ఎందుకు పీకెయ్యడంలేదు.?

YSRCP-did-not-pick-up-Raghu

YSRCP-did-not-pick-up-Raghu

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సొంత పార్టీపై అడ్డగోలు విమర్శలు చేస్తున్నారు. 2019 ఎన్నికలకు సరిగ్గా కొద్ది రోజుల ముందు ఆయన టిక్కెట్ సంపాదించారు, గెలిచారు కూడా. మొదట్లో బాగానే వున్నారుగానీ, ఎక్కడ తేడా కొట్టిందో వైసీపీ మీద తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ‘జగన్ ప్రభంజనంతోపాటుగా, ఎంతో కొంత నా బలం కూడా ఈ గెలుపులో వుంది’ అని రఘురామ చేసిన వ్యాఖ్యలతో దుమారం రేగింది. సొంత పార్టీ నేతలు విమర్శల కత్తులు దూయడంతో నర్సాపురం నుంచి ఢిల్లీకి పారిపోవాల్సి వచ్చింది రఘురామకృష్ణరాజు.. అంటారు చాలామంది. ఆయన మాత్రం ఢిల్లీకే పరిమితమైపోయారు.. అక్కడే రాజకీయాలు నడుపుతున్నారు. మొదట్లో ఢిల్లీ పెద్దలతో అత్యంత సన్నిహితంగా వున్నా, అమరావతి సహా పలు అంశాల్లో బీజేపీ మీద సెటైర్లు వేస్తూ కేంద్ర ప్రభుత్వ పెద్దలతోనూ దూరం పెంచుకున్నారనే విమర్శలున్నాయి.

తాజాగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ముఖ్యమంత్రి పదవిపై కన్నేశారని పరోక్షంగా రఘురామ చేసిన వ్యాఖ్యలు కొత్త దుమారానికి కారణమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన పెద్దిరెడ్డి, రఘురామకృష్ణరాజుపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. ‘కొమ్ములు లేని దున్నపోతు’గా రఘురామకృష్ణరాజుని అభివర్ణిస్తూ, ‘సిగ్గుంటే రాజీనామా చెయ్..’ అని సవాల్ విసిరారు. రఘురామ ఎటూ రాజీనామా చెయ్యరు.. వైసీపీ ఆయన్ని సస్పెండ్ చేసెయ్యొచ్చు కదా.? అన్నదే ఇక్కడ లాజికల్ పాయింట్. అలా చేస్తే, రఘురామ మీద అనర్హత వేటు పడకపోవచ్చన్న బెంగ వైసీపీలో వుంది. అందుకే, రఘురామ రచ్చబండ పేరుతో రోజూ పెట్టే నసని పట్టించుకోనట్టుగానే వ్యవహరిస్తూ చాలా భారంగా భరించేస్తోంది వైసీపీ. ఒక్క ఎంపీని బహిష్కరించలేకపోతోన్న వైసీపీ, రేప్పొద్దున్న పార్టీలో నిరసన గళం పెరిగితే ఏం చేయగలుగుతుందబ్బా.?