ఈమధ్య కాలంలో టీడీపీ నేతలు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల జపం చేస్తున్నారు. నోరు తెరిస్తే చాలు జమిలి ఎన్నికలనో, స్థానిక ఎన్నికలనో హడావిడి చేస్తున్నారు. మొన్నటి వరకు జమిలి ఎన్నికలు వస్తున్నాయని టీడీపీ చెప్తున్నారు అయితే ఇప్పుడు స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఈ స్థానిక ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని, అలాగే వైసీపీ పాలనపై ప్రజలు కూడా ఓట్ల ద్వారా తమ అభిప్రాయం చెప్తారని టీడీపీ నాయకులు భావిస్తున్నారు. మొన్నే వైసీపీ చేతిలో ఘోరంగా దెబ్బతిన్న టీడీపీ ఎందుకు స్థానిక ఎన్నికల కోసం ఇలా హడావిడి చేస్తుందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
అసలు స్థానిక ఎన్నికలు జరుగుతాయా!
మొదట స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమైనప్పుడు కరోనా రావడంతో ఎన్నికలను రద్దు చేస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని వైసీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. కానీ ఈ నిర్ణయాన్ని టీడీపీ మాత్రం సపోర్ట్ చేసింది. అయితే ఇప్పుడు స్థానిక ఎన్నికల నిర్వహించడానికి ఎన్నికల సంఘం సిద్ధమైంది కానీ వైసీపీ ఒప్పుకోవడం లేదు, టీడీపీ మాత్రం ఎన్నికల కోసం ఎదురు చూస్తుంది. ఈ స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘానికి, ప్రభుత్వానికి మధ్య ఒక చిన్న యుద్ధమే జరుగుతుంది. ఈ నెల 28వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో అన్ని రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం భేటీ కాబోతోంది. ఈ విషయమై ఇప్పటికే ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఓ నిర్ణయం తీసుకున్నారు. మరోపక్క, స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా లేదని మంత్రి గౌతం రెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం.
స్థానిక ఎన్నికల్లో అసలు టీడీపీ గెలుస్తుందా!
2019లో ఎన్నికలు జరిగిన తరువాత సగం కాలం కరోనాతో కాపురం చెయ్యడానికి సరిపోయింది. ఈ సమయంలో ఈ పార్టీ నాయకులు కూడా ప్రజల్లోకి వెళ్ళలేదు. ఎలాంటి రాజకీయ సమీకరణాలు కూడా మారలేదు. కానీ టీడీపీ మాత్రం స్థానిక ఎన్నికల కోసం తహతహలాడిపోతుంది. కరోనా సమయంలో కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక పథకాలను ప్రవేశపెడుతూ కనీసం ప్రజల్లో కొంత మంచి పెరు తెచ్చుకున్నారు కానీ చంద్రబాబు నాయుడు కరోనా సమయంలో అసలు ఇంటి నుండి బయటకు కూడా అలాంటిది స్థానిక ఎన్నికలకు ఎందుకు సిద్ధమయ్యారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. స్థానిక ఎన్నికలకు తాము వ్యతిరేకమని, కానీ ఒకవేళ స్థానిక ఎన్నికలు వచ్చినా కూడా 219లో వచ్చిన ఫలితాలే మళ్ళీ వస్తాయని వైసీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎన్నికలో టీడీపీ ఎన్ని చోట్ల విజయం సాధిస్తుందో వేచి చూడాలి.