దేశవ్యాప్తంగా ఉన్న చాలామంది ప్రజాప్రతినిధులపై ఎన్నో కేసులు నమోదయ్యాయి. అందులో ముఖ్యమంత్రలు ఉన్నారు.. మంత్రులు ఉన్నారు.. పెద్ద పెద్ద రాజకీయ నాయకులను కేసులు వదలవు. వాటిపై అమికస్ క్యూరీ హన్సారియా సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది.
ఇప్పటికే పలు నివేదికలు సమర్పించిన హన్సారియా.. మరోసారి.. ప్రజాప్రతినిధులపై ఉన్న క్రిమినల్ కేసులను ఈ సంవత్సరంలోపు విచారణ పూర్తి చేయాలని నివేదిక సమర్పించారు.
దేశంలోని అన్ని హైకోర్టలు ఇచ్చిన వివరాల ఆధారంగా హన్సారియా నివేదికను రూపొందించారు. అయితే.. కొన్ని హైకోర్టులు నోడల్ ప్రాసిక్యూటర్ ను ఇప్పటి వరకు నియమించలేదంటూ ఆయన ఆ నివేదికలో పేర్కొన్నారు.
ఈ నివేదిక ఆధారంగా.. సుప్రీంకోర్టు విచారణ చేపడుతోంది. అయితే.. ఇప్పటికే చాలామంది ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఎన్నోకేసులు సుప్రీంలో పెండింగ్ లో ఉన్నాయి. విచారణ చాలా ఆలస్యం అవుతోంది. అయితే.. ఈ కేసులకు సంబంధించి న్యాయస్థానాలకు వస్తున్న కొన్ని ముఖ్యమైన సమస్యలను న్యాయమూర్తులు లేవనెత్తుతున్నా.. ఆ సమస్యలపై క్లారిటీ రావట్లేదు.
ఇటువంటి మౌలిక సమస్యలపై క్యూరీ తన అభిప్రాయాలను నివేదికలో పొందుపరిచినట్టు తెలుస్తోంది. ఆ నివేదిక ఆధారంగా… ప్రజాప్రతినిధులు కూడా తమపై ఉన్న కేసులను త్వరగా విచారణ చేపట్టాలని సుప్రీంపైనే ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది.
అయితే.. ప్రజాప్రతినిధులకు సంబందించిన విషయాలు అంటే అవి శాసన, రాజకీయ వ్యవస్థకు సంబంధించినవి. ఒకవేళ నేతలు సుప్రీం మీద ఒత్తిడి తెస్తే.. సుప్రీం.. విచారణను ఎలా ముగిస్తుందో మాత్రం వేచి చూడాల్సిందే.
ఈ ఏడాదిలోపు కేసులన్నింటినీ విచారించాల్సి ఉండగా.. ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా త్వరగా తనపై ఉన్న కేసుల విచారణను పూర్తి చేసుకోవాలని భావిస్తున్నారు. ఈ నివేదికతో సీఎం జగన్ వెంటనే సుప్రీం తలుపు తట్టే అవకాశం కూడా ఉంది.