Pulse Polio: పిల్లలకు పోలియో చుక్కలు ఎందుకు వేయించాలి? వాటి వల్ల పిల్లలకు కలిగే ప్రయోజనం ఏమీ..?

Pulse Polio: పసి పిల్లల నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు చాలా అవసరం. పోలియో బారిన పడకుండా ఉండటానికి ప్రభుత్వం ప్రతి సంవత్సరం పోలియో చుక్కలను ఉచితంగా వేస్తుంటుంది. పోలియో రహిత దేశాన్ని నిర్మించడానికి ప్రభుత్వం ఈ చర్యలను చేపట్టింది. ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు కచ్చితంగా పోలియో చుక్కలు వేయించాలని ప్రభుత్వం అవగాహన కల్పిస్తుంది. దీనిలో భాగంగా నిండు జీవితానికి రెండు చుక్కలు అని ప్రచారం చేస్తున్నారు. అవునండి రెండు చుక్కలు జీవితాన్ని పోలియో బారిన పడకుండా కాపాడతాయి. పోలియో వ్యాధి ఎక్కువగా ఒక సంవత్సరం నుండి రెండు సంవత్సరాల పిల్లలలో మొదలవుతుంది. పోలియో డ్రాప్స్ ఎందుకు వేయించాలి? వేపించకపోతే ఏమవుతుంది? అని సందేహం చాలా మందిలో ఉంటుంది. పోలియో చుక్కలు వేపించకపోవడం వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయి అనే విషయం ఇక్కడ తెలుసుకోండి….

పోలియో వ్యాధి వల్ల నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. పోలిమొలైటీస్ అనే వైరస్ కారణంగా ఈ వ్యాది సోకుతుంది. ఇది రెండు విధాలుగా సోకుతుంది. మొదటిది అపరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం వల్ల ఈ వైరస్ వ్యాధి క్రీములు కడుపు లోకి పోయి పోలియో సోకుతుంది. రెండవది పోలియో సంబంధించిన క్రిములు గొంతులో ప్రవేశించడం. ఈ క్రిములు కడుపు లోకి ప్రవేశించి మలంలో ఎక్కువగా కనిపిస్తాయి. చేతులు, కాళ్లు సరిగ్గా కడుక్కోకపోవడం, అపరిశుభ్రంగా ఉండటం వల్ల ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. ఇది అంటూ వ్యాధి కూడా, పోలియో క్రిములు గొంతులో ఉన్న పిల్లలు దగ్గడం వల్ల అది ఎదుటి పిల్లాడికి వచ్చే అవకాశం ఉంది. ఈ క్రిములు ఒకసారి శరీరంలోకి ప్రవేశిస్తే క్రమంగా అభివృద్ధి చెందుతాయి. తద్వారా ఈ కణాలు రక్తంలో కలిసిపోయి, శరీరంలోని జీవకణాలను దెబ్బతీయడమే కాకుండా నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఫలితంగా కండరాలు బిగుసుకుపోయి పూర్తిగా మనిషి కదలలేని స్థితికి చేరే అవకాశం ఉంది.

పోలియో లక్షణాలు: పోలియో వైరస్ గొంతులోకి ప్రవేశించినపుడు గొంతులో శ్లేషం తయారవుతుంది. తీవ్రమైన మెడనొప్పి, తల నొప్పి సమస్యలు మొదలవుతాయి. తర్వాత శ్వాస కోస సమస్యలు, కండరాలు బలహీనంగా మారుతాయి. కొన్ని సందర్భాలలో మెడ వాలి పోతుంది. పోలియో వ్యాధి కారక క్రిములు 48గంటల్లో ఎక్కువగా వ్యాపిస్తాయి. ఆ తర్వాత రెండు మూడు రోజులు తీవ్రత తగ్గుతుంది, ఒక వారం తర్వాత తీవ్రత మరీ ఎక్కువ అయ్యి కండరాలు దెబ్బతినడం, నాడి వ్యవస్థ దెబ్బతినడం జరుగుతుంది. వ్యాధి తీవ్రత పెరిగే కొద్ది కండరాలు బిగుసుకుపోవడం, కుంచించుకుపోవడం జరుగుతుంది.ఈ వ్యాధికి గురైన పిల్లల కాళ్ళు చేతులు ఒంకరగా ఉంటాయి. కొంతమంది నడవటం కూడా కష్టం. ఈ వ్యాధిగ్రస్తులకు పక్షవాతం వచ్చే అవకాశం కూడా ఉంది.