సిటీ సేఫ్ గా ఉంటే కేసీఆర్ గ‌జ్వేల్ లో ఎందుకున్న‌ట్లు?

హెద‌రాబాద్ జీహెచ్ ఎంసీ ఫ‌రిదిలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు అంత‌కంత‌కు పెరిగిపోతున్న మాట వాస్త‌వం. డైలీ పాజిటివ్ కేసులు800కు పైగానే న‌మోదవుతున్నాయి. మ‌ర‌ణాల సంఖ్య కూడా బాగా పెరిగింది. రోడ్ల‌పై విధులు నిర్వ‌హిస్తున్న పోలీసులు యావ‌రేజ్ గా రోజుకు 10 మంది కోవిడ్ బారిన ప‌డుతున్నారు. ఒక‌ప్పుడు ప‌ది, ఇర‌వై అంటూ లెక్క‌లు చెప్పిన ప్ర‌భుత్వం ఇప్పుడు వంద‌ల్లో లెక్క‌లు చూపించాల్సి వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో క‌రోనా క‌ట్ట‌డి విష‌యంలో కేసీఆర్ ప్ర‌భుత్వం ఘోరంగా విఫ‌ల‌మైంద‌ని విమ‌ర్శ‌లు ఎదుర్కోంటుంది. తాజా ప‌రిస్థితుల నేప‌థ్యంలో లాక్ డౌన్ విధిస్తున్న‌ట్లు వ‌స్తోన్న వార్త‌ల నేప‌థ్యంలో న‌గ‌ర వాసులంతా ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు.

బ్ర‌తికుంటే బ‌చ్చ‌ల కూర అమ్ముకుని బ్ర‌తకొచ్చు..మా కొద్దు ఈ సీటీ జీవితం అంటూ ప్రాణాలు అర చేతిలో ప‌ట్టుకుని ప‌రుగులు తీస్తున్నారు. ఇక ప్ర‌జా ప్ర‌తినిధులు సీటీలో పెద్దగా ఉండ‌టం లేదు. అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్ప బ‌య‌ట‌కు రావ‌డం లేదు. సిటీకి దూరంగా ఉన్న ఫామ్ హౌస్ ల్లో ద‌ల‌దాచుకుంటున్నారు. కుటుంబాల‌తో పాటు ఫామ్ హౌస్ ల‌కు త‌ర‌లి వెళ్లిపోయారు. ఇక ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూడా గ‌జ్వేల్ లో సొంత నివాసంలో ఉంటున్నారు. నాలుగు రోజుల క్రిత‌మే ఫ్యామిలీతో అక్క‌డి వెళ్లారు. అయితే పోలీసు అధికారులు మాత్రం ఇందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సిటీలో పెద్ద‌గా కేసులు లేవ‌ని, మ‌ర‌ణాలు కూడా పెద్ద‌గా లేవ‌ని, భ‌యాందోళ‌న‌కు గురి కావాల్సిన అవ‌సరం లేద‌ని చెప్ప‌డం విడ్డూరంగా ఉంది.

దీంతో సామాన్య జ‌నం పోలీసుల‌కు సామాన్య జ‌నం అంతే ధీటుగా ప్ర‌శ్న‌లు సంధించారు. పోలీసులు చెబుతున్న‌ది నిజ‌మే అయితే ప్ర‌జా ప్ర‌తినిధులు ఎందుకు సిటీకీ దూరంగా ఉన్న‌ట్లు? కేసీఆర్ ఎందుకు గ‌జ్వేల్ లో ఉండ‌టం…రాష్ర్టంలో ప‌రిస్థితులు ఇంత సీరియ‌స్ గా ఉన్న‌ప్పుడు ఆయ‌న సిటీని వ‌దిలి గ‌జ్వేల్ కు ఎందుకు వెళ్లిన‌ట్లు? అని పోలీసుల్ని ప్ర‌శ్నిస్తున్నారు. మీరు రాజ‌ధాని కోసం ఆలోచించి మాట్లాడుతున్నారని, తాము ప్రాణాలు కాపాడుకోవ‌డానికి వ‌దిలి వెళ్లిపోతున్నామ‌ని చెబుతున్నారు. ఈ కార‌ణం చేతనే ప్ర‌భుత్వాధికారులు ఆపాస్ లు జారీ చేయ‌డం లేదంటూ మండ‌ప‌డుతున్నారు.