విశాఖపట్ణణం గొప్ప పర్యాటక ప్రాంతమని గత అధ్యయనాలే ఎన్నో చెప్పాయి. దేశంలో సుదరనగరంగా ఎన్నోసార్లు ఖ్యాతికెక్కింది. అభివృద్ధిలో వెనుకబడినప్పటికీ హైదరాబాద్, బెంగుళూరు, ముంబై లాంటి నగరాలకు ధీటుగా ఉండే నగరం అంటే కాదనేది ఎవరు? అభివృద్ధి లో సరైనా ప్రణాళికతో ముందుకు వెళ్తే ఆ నగరాల్ని తలదన్నేలా విశాఖ రూపం మార్చుకుంటుంది. త్వరలో జరిగేది కూడా అదే. ఉక్కు పరిశ్రమ, పార్మా పరిశ్రమ, ఐటీ పరిశ్రమకు దశాబ్ధాల క్రితమే పునాది రాయి పడి అభివృద్ధి పథంలో నడుస్తున్నాయి. వీటన్నింటికి మించి కావాల్సినంత సుముద్రతీరం విశాఖ సొంతం. ముంబై తర్వాత మరో ముంబై గా అవతరించడానికి ఆస్కారం ఉన్న దేశంలో రెండవ నగరం విశాఖ. వాణిజ్య రాజధానిగా విశ్వవ్యాప్తం కానున్న నగరం.
అవిభాజిత ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు రాజధానిగా విశాఖను ఏర్పాటు చేస్తే అభివృద్ధి వేగంగా జరుగతుందని, ఖర్చు తగ్గుతుందని కమిటీలు చెప్పినా స్వప్రయోజనాల కోసం చంద్రబాబు తన సామాజిక వర్గానికి కోసం పాటు పడి, ఎంతో కష్టపడి విజయవాడ- గుంటూరు మధ్య అమరావతిని రాజధానిగా చేసారు. అప్పుడే విశాఖను రాజధానిగా ప్రకటించి ఉంటే ఈ ఐదేళ్లలో చంద్రబాబు గ్రాపిక్స్ తెలివి తేటలకే విశాఖ రూపమే మారిపోయేది. ఇలా సకల సౌకర్యాలు విశాఖ సొంతం. అందుకే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విశాఖను పరిపాలనా రాజధానిగా చేసారు. ఇక తీరం వెంబడిన ప్రాంతమంతా పెద్ద ఎత్తున పర్యాటక కేంద్రంగా మారబోతుంది. రాజధాని అభివృద్ధి అంతా విశాఖ-విజయనగరం జిల్లాల మధ్యలో జరగనుంది.
ఆ బెల్ట్ లో కొంత భాగం తీరాన్ని అనుకుని ఉంది. ఆ ప్రాంతంలో ప్రభుత్వానికి స్థలాలు కూడా ఉన్నాయి. అదనంగా ప్రభుత్వ కార్యాలయాల కోసం భూ సేకరణ అవసరం లేదు. 2014లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బాలయ్య పేరిట ఆ స్థలాల్నే స్టూడియో ల అభివృద్ధికి రాసిచ్చినట్లు ప్రచారం సాగింది. దాదాపు 250 ఎకరాలు అన్నట్లు తెలిసింది. ఇప్పుడు జగన్ వాటన్నింటిని స్వాధీనం చేసుకుని రాజధాని అభివృద్ధిలో కలిపేసే యోచనలో ఉన్నారు. ఇక సీఎం క్యాంపు కార్యాలయం భీమిలికి సమీపంలో ఉన్న కాపులప్పాడు ప్రాంతంలో ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నది ప్లాన్. ఆ ప్రాంతమంతా బీచ్ అందాలే. కూత వేటు దూరంలో చుట్టూ కొండలు, అందమైన ప్రదేశంతో నెలవై ఉంటుంది. ఆ కొడల్ని చదును చేసి బిల్డింగ్ లు నిర్మిస్తే హైదరాబాద్ జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్ ని మించిపోయి ఉంటుంది. అదనంగా కడలి కెరటాల శబ్ధంతో అద్భుతమైన వ్యూ జగన్ సొంతం.