టీడీపీ నేతకు తెలంగాణ బీజేపీలో అంత క్రేజ్ ఎందుకు ..?

telangana bjp

 తెలంగాణలో త్వరలోనే ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందు కోసం అన్ని పార్టీలు తగిన అభ్యర్థులను సిద్ధం చేసుకునే పనిలో ఉన్నాయి , తెలంగాణలో జరిగే ప్రతి ఎన్నికలు కూడా అన్ని పార్టీలకు చాలా ముఖ్యమైనవే కావటంతో అబ్యర్దుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఇక బీజేపీ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పట్టును నిలుపుకోవడానికి గట్టిగానే ట్రై చేస్తున్నాయి.

 తమ సిట్టింగ్ స్థానమైన హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీను కాపాడుకోవటానికి ఎమ్మెల్సీ రామచంద్రరావు మరోసారి బరిలో దిగుతున్నాడు, ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా ఈ సారి కైవసం చేసుకోవాలని బీజేపీ గట్టి పట్టుదలతో వుంది. ఆ స్థానం నుండి పోటీచేయడానికి బీజేపీ లోని పెద్ద పెద్ద నేతలే సిద్ధంగా ఉన్నారు , అయితే వాళ్లందరికీ బీజేపీ పార్టీ పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పాలి.

e peddi reddy telugu rajyam

  మాజీ మంత్రి ఇ. పెద్దిరెడ్డికి ఇప్పటికే ఎమ్మెల్సీ టిక్కెట్ ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సమాచారంతో టిక్కెట్ ఆశిస్తున్నా బీజేపీ నేతలు ఖంగుతిన్నారు. గతంలో టీడీపీ జాతీయ కార్యదర్శిగా పనిచేస్తిన పెద్దిరెడ్డి 2018 ఎన్నికల సమయంలో హుజురాబాద్ నుండి పోటీచేయాలని అనుకున్నాడు. కానీ పొత్తులో భాగంగా కూకట్ పల్లి నుండి పోటీచేయాలని చంద్రబాబు చెప్పటంతో అక్కడికి మారటానికి సిద్దమయ్యాడు, కానీ అనూహ్యంగా మారిన పరిస్థితుల్లో ఆ స్థానం నుండి హరికృష్ణ కూతురు సుహాసిని పోటీకి దిగింది. దీనితో పెద్దిరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ బాబు మీద విమర్శలు చేశాడు.

 ఆ తర్వాత పెద్దిరెడ్డి బీజేపీ గూటికి చేరుకున్నాడు. నిన్నగాక మొన్న వచ్చిన పెద్ది రెడ్డికి టిక్కెట్ ఇవ్వటం పైన బీజేపీ పాతకాపు నేతలు గుర్రుగా ఉన్నకాని , బీజేపీ మాత్రం పెద్దిరెడ్డికి ఇవ్వటం వెనుక మరో బలమైన కారణం ఉందని తెలుస్తుంది. ఖమ్మంలో బీజేపీకి పెద్దగా పట్టు లేదు, మొన్నటిదాకా టీడీపీలో ఉన్న పెద్దిరెడ్డికి అక్కడ మంచి పట్టుంది. ఆ కోణంలోనే ఆయనకు టిక్కెట్ ఖరారు చేసినట్లు తెలుస్తుంది. మరి బీజేపీ తనమీద పెట్టిన నమ్మకాన్ని పెద్దిరెడ్డి ఎంత వరకు నిలబెడుతాడో చూడాలి.