Corona Effect:కరోనా వైరస్ గత రెండు సంవత్సరాలుగా ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసింది. కొత్త కొత్త వేరియంట్ ల రూపంలో తన రూపం మార్చుకుంటూ విజృంభిస్తోంది. అయితే డాక్టర్ల హెచ్చరికల ప్రకారం ఇది మధుమేహ సమస్యలు ఉన్న వారికి ఎక్కువ ప్రమాదకరం అని తెలియజేశారు. క్రితం సారి ఈ వైరస్ డెల్టా వేరియంట్ రూపంలో చేసిన కల్లోల్లం ఈ జనరేషన్ వారు ఎప్పటికీ మరువలేరు అని చెప్పవచ్చు. మధుమేహ సమస్యలు ఉన్నవారిలో మొదటిలో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువ కనిపించదు, కానీ వారి ఆరోగ్యం మీద చాలా ప్రభావం చూపుతుంది. డయాబెటిక్ పేషంట్స్ లో సాధారణంగా వ్యాధి రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది.
ప్రస్తుతం మారుతున్న జీవన శైలి వల్ల వయసుతో సంబంధం లేకుండా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.అలాంటి వాటిలో ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్న వ్యాధి మధుమేహం. మధుమేహం అంటే రక్తంలో చక్కెర స్థాయి అధికంగా ఉండటం. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరంలో ఉన్న రక్తం, శరీరంలోని అన్ని భాగాలకు పుష్కలంగా సరఫరా కావాలి. రక్తంలో చెక్కెర స్థాయి అధికంగా ఉండటం వల్ల రక్తం చిక్కగా గా మారి రక్త సరఫరా మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. శరీరం ఇన్ఫెకషన్ల కి గురైతే రక్తంలోని వైట్ బ్లడ్ సెల్స్ వైరస్ తో పోరాడే శక్తిని కలిగి ఉంటాయి. అయితే డయాబెటిక్ పేషంట్స్ లో చక్కెర స్థాయి ఎక్కువ ఉండటం వల్ల తెల్ల రక్త కణాలు 40 నుండి 50 శాతం మాత్రమే చురుకు గా పనిచేస్తాయి.
మానవ శరీరంలో యాంటీబాడీస్ ను ఉత్పత్తి చేసే బీ కణాలు ఉంటాయి. షుగర్ పేషెంట్స్ లో ఈ కణాలు రక్తంతోపాటు గా ప్రవహిస్థాయి. దీనివల్ల వైరస్ ని కట్టడి చేసే యాంటీబాడీస్ ను వృద్ది చేయలేదు. డయాబెటిక్ పేషంట్స్ వీలైనంత జాగ్రత్త వహించడం చాలా మంచిది. వైరస్ సోకిన వెంటనే డాక్టర్ ను సంప్రదించి,వారి సూచనల మేరకు హాస్పిటల్ లో అడ్మిట్ అవ్వడం శ్రేయస్కరం.
ఈ కరోనా విజృంభిస్తున్న సమయం లో వీలైనంత వరకు షుగర్ వ్యాది గ్రస్తులు బయట తిరగకపోవడం మంచిది. పీచుపదర్థాలు, మాంసకృత్తులు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. కరోనా సమయంలో వీలైనంత వరకు షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ లో ఉంచుకోవాలి.