Covid Recovery Tips: కరోనా నుండి కోలుకున్న తర్వాత బ్రష్ ఎందుకు మార్చాలో తెలుసా?

Covid Recovary Tips: ప్రపంచ దేశాలన్నింటిలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రస్తుతం కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి అందరిని భయపెడుతోంది. కరోనా బారిన పడకుండా ఉండాలంటే తగు జాగ్రత్తలు తీసుకుంటూ పౌష్టిక ఆహారం తీసుకోవాలి. కరోనా బారిన పడకుండా ఉండటానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో.. కరోనా నుండి కోలుకున్న వారు కూడా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఆ జాగ్రత్తల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

కోవిడ్ నుండి రికవరీ అయిన తర్వాత కూడా లక్షణాలను బట్టి లక్షణాల తీవ్రత తక్కువగా ఉన్నవారు ఐదు రోజులు, లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉన్నవారు పది రోజులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి అని కేంద్రం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. శానిటైజర్ వాడుతూ, సామాజిక దూరం పాటిస్తూ కరోనా కట్టడి చేయడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

మనం వాడే టూత్ బ్రష్ కూడా కరోనా నుండి కోలుకున్న తర్వాత మార్చాలి. టూత్ బ్రష్ తప్పనిసరిగా మార్చాల్సిన అవసరం ఏముంది అని అందరికి సందేహంగా ఉండవచ్చు. సాధారణంగా మూడు నెలలకు ఒకసారి మనం వాడే టూత్ బ్రష్ తప్పక మార్చాలి అని నిపుణులు సూచిస్తున్నారు. ప్లాస్టిక్ లో బ్యాక్టీరియా, ఫంగస్ ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది. అందువల్ల కరోనా నుండి కోలుకున్న తర్వాత టూత్ బ్రష్ మార్చాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

సాధారణంగా టూత్ బ్రష్ లు అందరూ ఒకే చోట ఉంచుతారు. అందువల్ల మీ బ్రష్ లోని వైరస్ వేరొకరి బ్రష్ లో కి చేరి వారు కూడా కరోనా బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల కరోనా నుండి కోలుకున్న తర్వాత వైరస్ వేరొకరికి వ్యాప్తి చెందకుండా ఉండాలంటే టూత్ బ్రష్ తప్పనిసరిగా మార్చాలి.