AP: బాబు దావోస్ పర్యటన …. ఏపీకి ఒక్క ఎంవోయూ కూడా చేసుకోలేదా…ఎందుకు?

AP: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన బృందంతో దావోస్ పర్యటన వెళ్లిన సంగతి తెలిసిందే అయితే ఈ పర్యటన ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ పర్యటనలో భాగంగా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరై పెద్ద ఎత్తున వారి రాష్ట్రాలకు పెట్టుబడుల కోసం ఒప్పందాలను కుదుర్చుకున్నారు పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి సైతం కొన్ని లక్షల పెట్టుబడులను తమ రాష్ట్రానికి ఆహ్వానిస్తూ ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఇక ఈ పర్యటనలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం ఒక్క ఎంవోయూ కూడా చేసుకోకపోవడం హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు లోకేష్ ఇద్దరు కూడా ఎంతో మంది అగ్ర నేతలతో, అగ్ర సంస్థలతో సమావేశాలు , ఏపీ వాతావరణం, అభివృద్ధి ఇలా అన్ని విషయాలను తెలియచేశారు అలాగే ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఎన్నో సమస్యలు ముందుకు వచ్చాయి. కానీ ఎంవోయూ మాత్రం చేసుకోలేకపోయాయని తెలుస్తోంది.

పక్క రాష్ట్రమైన తెలంగాణ గత రికార్డ్స్ బ్రేక్ చేశామని , లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చామని ప్రచారం చేస్తుంటే..చంద్రబాబు మాత్రం సైలెంట్ గా ఉండడం ఏంటి అని కూటమిలో కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇలా మన రాష్ట్రానికి ఒక్క ఎంవోయూ కూడా రాకపోవడం వెనుక చంద్రబాబు నాయుడు లెక్క మరోలా ఉందని తెలుస్తోంది. దావోస్ పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు ఎప్పుడు వెళ్లిన వేలకోట్లు లక్షల కోట్లు పెట్టుబడులు అంటూ హంగామా చేశారు కానీ ఈసారి మాత్రం సైలెంట్ గా ఉన్నారు.

ఇలా సైలెంట్ గా ఉండడం వెనుక కారణం లేకపోలేదు. పారిశ్రామికవేత్తలకు ఆంధ్రప్రదేశ్ అనుకూలతల గురించి ప్రజెంటేషన్ ఇవ్వడం. తమ రాష్ట్రానికి వచ్చి క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని కోరడానికే ప్రాధాన్యం ఇచ్చారు. మాములుగా దావోస్ పర్యటలో భాగంగా ఎన్నో సంస్థలు అక్కడికి వస్తాయి అయితే వారందరితో చర్చించి మన రాష్ట్ర పరిస్థితుల గురించి వారికి తెలియజేస్తూ వారిని పెట్టుబడులు పెట్టడం కోసం ఆహ్వానిస్తారు. ఇలా ఈ పర్యటనలో ఒప్పందం చేసుకున్న వారందరూ కూడా పెట్టుబడులు పెట్టడానికి వస్తారు అనే విషయంపై ఖచ్చితంగా చెప్పలేము ఇలా ముందుగా ఒప్పందం కుదుర్చుకొని మరి పెట్టుబడులు రాకపోతే ఎంతో అవమానకరంగా ఉంటుంది అందుకే చంద్రబాబు నాయుడు ఎలాంటి ఒప్పందాలను చేసుకోలేదని ముందుగా మన రాష్ట్ర పరిస్థితులను తెలియజేసి పెట్టుబడులు పెట్టడానికి ఆలోచన చేయాలంటూ పారిశ్రామికవేత్తలను కోరినట్లు తెలుస్తోంది. అందుకే ఒక్క ఎంవోయూ కూడా రాలేదని తెలుస్తుంది.