RamGopal Varma: గత కొన్ని రోజుల నుంచి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై టికెట్ల విషయంలో వర్మ తనదైన శైలిలో స్పందిస్తూ విమర్శలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీ మంత్రి పేర్ని నానితో వర్మ పెద్దఎత్తున వివాదానికి దిగారు.ఇలా వీరిద్దరి మధ్య వివాదం జరుగుతున్న నేపథ్యంలో నాని వర్మకు అపాయింట్మెంట్ ఇచ్చి తనని కలవమని చెప్పారు. వర్మ అపాయింట్ మెంట్ తీసుకుని పేర్నినానితో కలిసిన అనంతరం ఈ వివాదానికి చెక్ పడుతుందని అందరూ భావించారు. అయితే మంత్రి భేటీ అనంతరం వర్మ ఏ మాత్రం తగ్గకుండా ఏపీ ప్రభుత్వం పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
ఈ సందర్భంగా మరోసారి వర్మ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పై తనదైన శైలిలో ట్వీట్స్ చేస్తూ విమర్శలు చేశారు. ఈ సందర్భంగా వర్మ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ… కట్టప్పను చంపింది ఎవరు? అంటూ పరోక్షంగా ఏపీ ప్రభుత్వం పై సెటైర్లు వేస్తున్నారు. ఈ క్రమంలోనే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమాకి ఉత్తరాది రాష్ట్రాలలో 2200/-టికెట్ ధర ఉంటే సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో మాత్రం 200/- ధర కూడా లేకపోవడం విడ్డూరం అంటూ వర్మ ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.
ఈ క్రమంలోనే కట్టప్పను చంపింది ఎవరు అంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీని ప్రభుత్వమే చంపేస్తోంది అంటూ పరోక్షంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై విమర్శలు చేయడంతో పలువురు ఈ విషయంపై స్పందిస్తూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వర్మ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక వర్మ చేసిన ఈ వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.