పితృపక్షాలలో అన్నదానం చేస్తే ఫలితం ఇదే !

పితృపక్షాలలో అన్నదానం చేస్తే ఫలితం ఇదే !

భాద్రపద కృష్ణపక్షం అంతా పితృపక్షాలుగా పిలుస్తారు. ఈ సమయం పెద్దలకు సంబంధించిన కర్మలు, శ్రాద్దాలు, వారి పేరుమీద దానధర్మాలు చేయాలని శాస్త్రవచనం. ఇక ప్రతి మాసంలోను అమావాస్య , పితరుల పుణ్య తిథి గా భావించబడినా , మహాలయ అమావాస్య కు విశేష ప్రాముఖ్యత ఉంటుంది. శ్రాద్ధ కర్మతో సంతోష పెడితే వారు తమ సంతత వారి ఆయువు , విద్య , ధనం, సంతానం , సమస్తం కలిగి ఉండేట్టు ఆశీర్వదిస్తారు.

what is the result of annadanam or food donate
what is the result of annadanam or food donate

అన్నదానం ఎప్పుడు చేసిన మంచి ఫలితాన్నే వస్తుంది., కాని ఈ మహాలయపక్షంలో చేసే అన్నదానం వలన అనంతకోటి యజ్ఞ ఫలితం ప్రాప్తిస్తుంది. అలాగే మఖ నక్షత్రం పితరులకు సంబందించింది కనుక ఆ రోజు చేసిన శ్రాద్ధ కర్మ అక్షయఫలన్నిస్తుంది. మహాలయ పక్షంలో ఏ రోజు శ్రాద్ధ కర్మ చేస్తే ఎటువంటి ఫలితం లబిస్తుందని వివిధ పురాణాల పేర్కొన్నాయి. కాబట్టి ఎవరి శక్తిమేరకు వారు ఆయా దానాలు, ధర్మాలు పెద్దల పేరుమీద పేదలకు, బ్రాహ్మణులకు దానం చేయండి.