ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలకంగా ఉన్న ప్రాంతం విశాఖ. అక్కడి నుంచే నాయకులు పావులు కదుపుతుంటారు. ప్రస్తుతం విశాఖ పాలనా రాజధాని కాబోతున్నది. పాలనా రాజధాని అంటే ఖచ్చితంగా విశాఖను అభివృద్ధి చేయాల్సిందే. ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా విశాఖను అభివృద్ధి దిశలో తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు.
కానీ.. ఇక్కడ అభివృద్ధి గురించి కాదు సమస్య. ఇటువంటి పరిస్థితుల్లో ఉత్తరాంధ్రలో రాజకీయాల్లో చాలామార్పులు చోటు చేసుకోబోతున్నాయట. వైసీపీ పార్టీలో పలు కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయట.
ఎప్పటి నుంచో టీడీపీ లీడర్ గంటా శ్రీనివాసరావును వైసీపీలోకి తీసుకురావడానికి ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయన ఇవాళ, రేపు అన్నట్టుగా చూస్తున్నారు. గంటా వస్తే.. టోటల్ విశాఖ జిల్లా టీడీపీ నాయకులు మొత్తం వైసీపీ లోకి వస్తారు. దీని వల్ల పార్టీ కేడర్ పెరుగుతుంది.. అనేది వైసీపీ పెద్దల అభిప్రాయం.
అయితే.. గంటా వైసీపీలోకి రాకూడదని కొందరు వైసీపీ నేతలు అడ్డుపడుతున్నారు. అవంతి అయితే డైరెక్ట్ గానే చెప్పేస్తున్నారు. గంటాను తీసుకోవద్దని పార్టీ హైకమాండ్ కు సలహాలు ఇస్తున్నారు.
అందులోనూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి, మంత్రి బొత్స సత్యనారాయణ కు అస్సలు పడటం లేదట. అది కూడా ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కలకలం లేపుతోంది. విజయసాయిరెడ్డితో అంటీముట్టనట్టుగా ఉంటున్న బొత్స.. మరో నేత ద్వారా గంటా శ్రీనివాసరావును వైసీపీలోకి లాగడానికి ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు విజయసాయిరెడ్డి మీద గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కావాలని బొత్సే ఇదంతా చేయిస్తున్నారంటూ రాజకీయ వర్గాల్లో వినికిడి.
ఏది ఏమైనా.. బొత్స సత్యనారాయణ మంత్రి పదవిలోనూ పలు మార్పులు చోటు చేసుకోబోతున్నాయట. ఇలా ఉత్తరాంధ్ర రాజకీయాల్లో పెను మార్పులు త్వరలోనే చోటు చేసుకోబోతున్నాయని… ఇదంతా విశాఖ పాలనా రాజధాని అవడం వల్లనే అని తెలుస్తోంది.