Health Tips: శొంఠి,లవంగాల వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా? తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Health Tips: భారతీయ వంటింట్లో ఉంటే ప్రతి పదార్థం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా మసాలా దినుసులు వల్ల ఆహారం రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.ఎండు అల్లం, లవంగాలను ఉపయోగించడం వల్ల శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఎండు అల్లాన్ని శొంఠి అంటారు. ఆయుర్వేదంలో కూడా దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆయుర్వేదంలో శొంఠి ని ఔషధంగా వినియోగిస్తారు. పొడి అల్లం, లవంగలలో ఎన్నో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫలమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి కాకుండా వీటిని ఆహరంలో మసాలా గా కూడా వినియోగిస్తారు. శొంఠి, లవంగాలను తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఒక సారి చడివేయండి.

* రోగనిరోధక శక్తి ని పెంపొందించడంలో శొంఠి, లవంగాలు ఎంతో ఉపయోగపడతాయి. శొంఠి, లవంగాలలో కాప్లిసిన్, కర్కుమిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఇవి రోగనరోధకశక్తిని పెంపొందించడంలో సహాయపడతాయి.
*శొంఠి, లవంగం, తేనెను కలిపి తీసుకోవడం వల్ల శ్వాస కోస సమస్యలు తగ్గిపోతాయి. శొంఠి, లవంగాలను కలిపి డికాషన్ లాగా తాగటం వల్ల కూడా శ్వాస సంబంధిత వ్యాధులు తగ్గుతాయి.
*పంటి నొప్పి సమస్య లకు కూడా సొంటి, లవంగం చాలా బాగా ఉపయోగపడతాయి. లవంగాలలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పంటి నొప్పిని నివారించడానికి సహాయపడుతాయి.
*సొంటి పొడిని నీరు లేదా పాల లో కలిపి తాగడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గించి అధిక బరువు సమస్యని తగ్గిస్తుంది.
*శొంఠి, లవంగాలు ఏదో ఒక రూపంలో ప్రతి రోజూ తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది.