Jaggery Benifits: సాధారణంగా ప్రతి వంటింట్లో బెల్లం ఉంటుంది. బెల్లం రుచికి తియ్యగా ఉండటమే కాకుండా బెల్లం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ఆయుర్వేదంలో కూడా బెల్లం ప్రముఖ పాత్ర వహిస్తుంది. బెల్లంలో మన ఆరోగ్యానికి అవసరమయ్యే అనేక రకాల పోషకాలు ఉంటాయి. ప్రస్తుత కాలంలో నాణ్యమైన బెల్లం లభించటం లేదు అందువల్ల బెల్లం తినటానికి చాలామంది సందేహ పడుతుంటారు. బెల్లం లో క్యాల్షియం, ఐరన్ , మినరల్స్ వంటివి పుష్కలంగా లభిస్తాయి. బెల్లం తినటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అందరికీ తెలుసు ఉ కానీ.. ఖాళీ కడుపుతో బెల్లం తినడం వల్ల ఇంకా ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి.
బెల్లంలో ఐరన్, క్యాల్షియం, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఖాళీ కడుపుతో బెల్లం తిన్న వెంటనే మన శరీరానికి కావాల్సిన తక్షణ శక్తి లభిస్తుంది. అంతేకాకుండా శరీరంలో ఎముకల దృఢత్వానికి బెల్లం ఎంతగానో సహాయపడుతుంది. ఖాళీ కడుపుతో బెల్లం తినడం వల్ల జీర్ణక్రియ సంబంధిత సమస్యలు కూడా తొలగిపోతాయి.
బెల్లంలో ఐరన్, ఫోలేట్ వంటి కారకాలు ఉండటంవల్ల ఇది శరీరంలోని ఎర్ర రక్త కణాలు తగ్గకుండా నియంత్రిస్తాయి. బెల్లంలో ఫ్యూక్రోజ్ ఎక్కువగా ఉండటం వల్ల అజీర్తి, మలబద్దకం వంటి సమస్యలను కూడా నియంత్రిస్తుంది.
ఖాళీ కడుపుతో బెల్లం తినటం వల్ల ఎముకలు దృఢత్వం పెరిగి కీళ్ల నొప్పులు, కీళ్ళ వాపు వంటి సమస్యల నుండి విముక్తినిస్తుంది. హైబీపీ సమస్యతో బాధపడేవారు ఉదయమే బెల్లం తినడం వల్ల వారి సమస్యను అదుపులో ఉంచవచ్చు. బెల్లంలో ఉండే సోడియం పొటాషియం వంటి కారకాలు శరీరంలో లో యాసిడ్ పరిమాణాన్ని తగ్గించడం వల్ల ఎర్ర రక్త కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. తద్వారా హైబీపీ సమస్యను అదుపు చేయవచ్చు.