NTR:తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి వారసుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన కెరియర్ మొదట్లో హిట్టూ ,ఫ్లాపులను కూడా చవి చూశారనే విషయం మనకు తెలిసిందే. ఇక ఎన్టీఆర్ ఫ్లాప్ సినిమాల విషయానికి వస్తే అందులో ఆంధ్ర వాలా ఒకటి అనే విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటించిన సింహాద్రి సినిమా తరువాత రావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు పెద్ద ఎత్తున అంచనాలు పెట్టుకున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదలకు ముందే పెద్ద ఎత్తున రిలీజ్ బిజినెస్ ను కూడా చేసింది.
ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన ఆవుల గిరి ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆంధ్రావాల సినిమా పై ఎన్నో అంచనాలు ఉన్నాయని ఈ క్రమంలోనే ఈ సినిమా ఆడియో వేడుక కోసం ఏకంగా పదిహేను లక్షల మంది అభిమానులు వచ్చారని గిరి తెలిపారు. ఇలా ఫ్యాన్స్ అందరూ చుట్టుముట్టడంతో వెళ్లడానికి కూడా ఆస్కారం లేకుండా పోయిందని ఆయన తెలిపారు.
ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ను అర కిలోమీటరు దూరం వరకు ఎత్తుకొని వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేశారు.ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను సందడి చేయలేక పోయినప్పటికీ తనకు మాత్రం ఎలాంటి నష్టాలు తీసుకు రాలేదని తెలిపారు.కానీ ఈ సినిమాను కొన్న బయ్యర్లు నష్టపోవడంతో వారి డబ్బును కొంత వెనక్కి తిరిగి చెల్లించినట్లు ఈ సందర్భంగా నిర్మాత ఆవుల గిరి వెల్లడించారు.
