నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా… ఈ చిట్కాలు మీ కోసమే!

మన ఆరోగ్యానికి ఆహారం ఎంత అవసరమో అలాగే నిద్ర కూడా అంతే అవసరం. ఈ రెండింటిలో ఏది తక్కువైనా అనారోగ్యాన్ని చేతులారా నాశనం చేసుకున్నట్టే. ప్రస్తుత కాలంలో పని ఒత్తిడిలో పడి ఎప్పుడు తింటున్నామో, ఎప్పుడు నిద్రపోతామో కూడా అర్థం కాని పరిస్థితి.డబ్బు సంపాదనలో పడి ప్రజలు టైంకి తినటం, నిద్రపోవటం మానేసి వారికి వీలైన సమయంలో తినటం టైం దొరికినప్పుడు నిద్రపోవటం చేస్తున్నారు. అందువలన వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.రాత్రివేళ సరిగా నిద్ర పట్టక ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారి కోసం ఇప్పుడు మనం కొన్ని చిట్కాల గురించి తెలుసుకుందాం.

ముఖ్యంగా నిద్రపట్టక పోవడానికి అసలైన కారణం కడుపునిండా సమయానికి ఆహారం తీసుకోకపోవడమే. కాబట్టి సమయానికి కడుపునిండా తింటే నిద్ర బాగా వస్తుంది. రాత్రివేళ నిద్రపోయేటప్పుడు ఎటువంటి శబ్దాలు, వెలుతురు లేకుండా ఉండేవిధంగా చూసుకోండి. నిద్రపోయే ముందు కళ్ళకి సిల్క్ స్లీప్ ఐ మాస్క్ వేసుకొని పడుకుంటే నిద్ర బాగా పడుతుంది.

బెడ్ రూమ్ లో లావెండర్ సువాసన గల రూమ్ ఫ్రేశ్నేస్ నీ వాడండి. ఇది నిద్రలేమితో బాధపడేవారికి నిద్రపోవటానికి ఉపయోగపడుతుంది. అలాగే బెడ్ రూమ్ లో గోడలకు డార్క్ కలర్ పెయింటింగ్స్, మరియు కలర్ కర్టెన్స్ ఉండేవిధంగా చూసుకుంటే మంచిది. అలాగే రాత్రి సమయంలో పడుకోవడానికి రెండు గంటల ముందు భోజనం చేయడం వల్ల మంచి నిద్ర పడుతుంది పడుకోవడానికి ముందు లాప్టాప్ సెల్ఫోన్లను దూరం పెట్టడం వల్ల సుఖమైన నిద్ర పొందవచ్చు.