Weight Loss Tips: ఈ ఆధునిక కాలంలో చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య అధిక బరువు సమస్య. చిన్నా, పెద్దా, యువత అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరు ఈ సమస్య వల్ల బాధపడుతున్నారు. బరువు తక్కువగా ఉన్నవారు సరైన పోషకాలు ఉన్న ఆహారం తినటం వల్ల బరువు పెరగవచ్చు, కానీ ఒకసారి బరువు పెరిగిన తర్వాత దాన్ని తగ్గించుకోవడం అంత సులువైన విషయం కాదు.
చాలా మంది బరువు తగ్గించుకోవడానికి డాక్టర్ల దగ్గరికి వెళ్లి వారు చెప్పిన విధంగా డైట్ ఫాలో అవ్వడం, వాకింగ్ చేయడం, వ్యాయామం చేయడం వంటివి చేస్తుంటారు. ఇంకొంతమంది జిమ్ ట్రైనర్ ని కలవడం వారు చెప్పిన ఎక్సర్సైజులు చేయడం చేస్తుంటారు. కానీ వారి బిజీ లైఫ్ వల్లనో లేదా బద్ధకం వల్లనో ఇవి కొన్ని రోజులు చేసిన తరువాత మానేస్తుంటారు. కొంతమందికి డైట్ ఫాలో అవుతూ కడుపుని ఆకలితో ఉంచడం చేతనవదు. చాలా మంది టీనేజర్స్ బయట దొరికే ఫాస్ట్ ఫుడ్స్ కు అధికంగా అడిక్ట్ అయ్యారు. ఇటువంటి అలవాట్లు శరీర బరువు పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.
అయితే ఈ వ్యాయామాలు, డైట్లు ఏవి అవసరం లేకుండా ఇక్కడ సూచించిన చిరుధాన్యాలను మీ ఆహారంలో భాగం చేసుకుంటే శరీర బరువును కంట్రోల్లో ఉంచుకోవచ్చు. జొన్నలు ఇంకా రాగులను ఎక్కువగా తినడం వల్ల మీ శరీర బరువు కంట్రోల్ లో ఉంటుంది.
జొన్నలు: ఇప్పుడు ఉన్న జనరేషన్ జొన్న తో చేసిన ప్రొడక్ట్స్ ని ఎక్కువగా ఇష్టపడరు. అయితే మీ ఇంట్లో కనుక పెద్దవాళ్లు ఉన్నట్టయితే వారు ఎక్కువగా జొన్న రొట్టెలు వంటివి ఇష్టంగా తింటుంటారు. జొన్నలో యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బి, ఫెనొలిక్ యాసిడ్స్, టానిన్స్ ఉంటాయి. రోజులో 96 గ్రాముల జొన్న తో కూడిన ఆహారపదార్థాలు తీసుకుంటే శరీరానికి కావాల్సిన ఫైబర్ లో 20% దొరుకుతుంది. ఫైబర్ పేగులను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. మెగ్నీషియం ఎముకలు, గుండె పనితీరును మేగుపరుస్తుంది. విటమిన్ బి జీవక్రియ రేటును పెంచడం తో పాటు జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది.
రాగులు: రాగులలో ఐరన్, కాల్షియం, పొటాషియం అధికంగా ఉంటాయి. హిమోగ్లోబిన్ ఉత్పత్తి అవ్వడానికి కావలసిన ఐరన్ రగులలో ఉంటుంది. రాగుల లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఇవి అరగడనికి ఎక్కువ సమయం పడుతుంది, ఫలితంగా త్వరగా ఆకలి అవ్వదు. ఇందులో అమినో యాసిడ్స్ కూడా ఉంటాయి, ఇవి పిల్లల మెదడు పెరుగుదలకు సహాయపడుతుంది. మధుమేహ సమస్యలు ఉన్నవారికి కూడా ఇది మంచి ఆహారం.