అయ్యబాబోయ్ మళ్ళీ ఓటుకినోటు కేసు బయటకొచ్చింది – చంద్రబాబు + రేవంత్ జైలుకా ??

revanth reddy cbn

“ఓటుకు నోటు” ఈ పదం తెలుగు రాష్ట్రాల్లో తెలియని వాళ్ళు ఎవరు ఉండరనే చెప్పుకోవాలి. 2015 లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు మరోసారి తెరమీదకు వచ్చింది. ఆంధ్ర విడిపోయిన తరువాత తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ అతి తక్కువ స్థానాల్లోనే విజయం సాధించింది. ఈ క్రమంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ నుండి వేం నరేంద్రరెడ్డి పోటి చేశారు. నిజానికి ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి గెలిచే అవకాశం లేదు. అయినా పోటీకి దిగటంతో అందరు ఆశ్చర్యపోయారు.

votuku note

తర్వాత కొద్దిరోజులకు అప్పటి టీడీపీ ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి తెలంగాణా నామినేటెడ్ ఎంఎల్ఏ స్టీఫెన్ సన్ ఇంట్లో డబ్బుతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. స్టీఫెన్ ఓటును కొనుగోలు చేయటానికి ముందుగానే రూ. 5 కోట్లకు బేరం కుదుర్చుకున్న విషయం బయటపడింది. మాట్లాడుకున్న బేరంలో భాగంగానే అడ్వాన్సు డబ్బు రూ. 50 లక్షలు ఇవ్వటానికి స్వయంగా రేవంత్ తన అనుచరుడు ఉదయసింహతో కలిసి నామినేటెడ్ ఎంఎల్ఏ ఇంటికి వచ్చారు. ఇదే సమయంలో ఏసీపీ దాడి  చేయటం, రేవంత్ రెడ్డి టీమ్  అడ్డంగా దొరకటం, స్టీఫెన్ మరియు చంద్రబాబు మధ్య జరిగినట్లు చెపుతున్న ఫోన్ సంబాషణ బయటకు రావటం జరిగింది.

 దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసులో ప్రధాన సూత్రదారి చంద్రబాబే అని నిర్ధారణకు వచ్చారు. అయితే చంద్రబాబు హైకోర్టుకెళ్ళి విచారణ జరగకుండా స్టే తెచ్చుకున్నారు. ఆ బ్రహ్మ దేవుడొచ్చిన ఈ కేసు నుండి చంద్రబాబును కాపాడలేరని చెప్పిన కేసీఆర్, ఆ తర్వాత మాట మార్చి కొద్దీ రోజులకే ఈ కేసులో బాబును శిక్షించటం ఎవరి వాళ్ళ కాదని చెప్పటం విశేషం, ఈ క్రమంలోనే హైదరాబాద్ పదేళ్ల ఉమ్మడి రాజధానిగా ఉన్నకాని దానిని వదిలేసి అమరావతికి వెళ్ళిపోయాడు బాబు, ఇక ఆ తర్వాత ఓటుకు నోటు కేసు నత్త నడక విచారణ సాగుతూ ముందుకు వెళ్తుంది.

అయితే ప్రజా ప్రతినిధుల మీదున్న కేసులను తొందరగా విచారణ చేయాలన్న సుప్రింకోర్టు ఆదేశాల నేపధ్యంలో ఓటుకునోటు కేసు విచారణ మొదలైంది. ఇక ఈ కేసులో తమను ఉద్దేశ్యపూర్వకంగా ఇరికించారు కాబట్టి తమ పేర్లను తొలగించాలని కోరుతు ఎంఎల్ఏ సండ్ర వెంకటవీరయ్య, రుద్ర ఉదయసింహ వేసిన డిస్చార్జి పిటీషన్ను కోర్టు కొట్టివేస్తూ, ఓటుకునోటు కేసులో కుట్ర జరిగిందనేందుకు అవసరమైన సాక్ష్యాధారాలున్నట్లు ఏసీబీ కోర్టు అభిప్రాయపడటమే కాకుండా, నిందితుల పై అభియోగాలు నమోదు చేసేందుకు వీలుగా కేసు విచారణను వాయిదా వేస్తున్నట్లు ఏసీబీ కోర్టు ప్రధాన న్యాయమూర్తి సాంబశివరావునాయుడు ప్రకటించారు. ఈ కేసు విచారణ నిష్పక్షపాతంగా జరిగితేనే, ఇందులో నిజమైన దోషులెవరనే విషయం బయటకు రాదు..