ఇది అద్దిరిపోయే రివర్స్ పంచ్.. వైజాగ్ రాజధాని కావాలి అంటూ సుప్రీంకు..!

Main difference between Amaravathi and Vizag

“రాజధాని” అనే పదం ఆంధ్రప్రదేశ్ లో విన్నంతగా ఎక్కడా వినలేము. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇదే టాపిక్ మాట్లాడుతున్నారు. అమరావతి ని రాజధానిగా మాజీ ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు నియమించారు. అప్పుడు ఈ విషయాన్ని వైసీపీ అధినేత, ప్రస్తుత సీఎంగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి ఒప్పుకున్నారు. అయితే 2019 ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల అంశం తెరపైకి తీసుకువచ్చారు.

అప్పుడు మొదలైంది ఈ రాజధాని రచ్చ. మూడు రాజధానుల అంశం తెరపైకి రాగానే అమరావతి రైతులు, ప్రతిపక్షాల ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. తమకు అన్యాయం జరుగుతుందని అమరావతి రైతులు ధర్నాలు చేస్తున్నారు. ఈ ధర్నాలకు, రైతుల ఉద్యమానికి ప్రతిపక్షాలు మద్దతు తెలుపుతున్నారు. తమకు అన్యాయం జరుగుతుందని రైతులు, ప్రజలు కోర్ట్ లను ఆశ్రయిస్తున్నారు. హై విచారిస్తూ మూడు రాజధానుల అంశంపై సెప్టెంబర్ 21వరకు స్టేటస్ కోను విధించింది. స్టేటస్ కోతో అమరావతి రైతులు సంబరాలు చేసుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు రైతులకు విశాఖవాసులు షాక్ ఇవ్వనున్నారు.

ఏనాడూ అభివ్రుద్ధికి నోచుకోని ఉత్తరాంధ్రా జిల్లాలకు పరిపాలన రాజధానిగా చేయడం వల్ల తమకు ఉపాధి అవకాశాలు మెరుగు అవుతాయని, వలసల జిల్లాలకు మోక్షం కలుగుతుందని, అయితే రాజధానిని అడ్డుకునేలా కొన్ని రాజకీయ పార్టీలు వ్యవహరించడం, విశాఖ రాజధానిగా ఎందుకు పనికిరాదు అని కించపరచే విమర్శలు సరికాదని విశాఖ వాసులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాగే ప్రతిపక్షాలు మూడు రాజధానుల అంశాన్ని అడ్డుకుంటే తాము కూడా కోర్ట్ లను ఆశ్రయిస్తామని విశాఖ వాసులు హెచ్చరిస్తున్నారు. అమరావతిని రాజధానిగా చేస్తే తమ జిల్లాలు ఇంకా వెనకపడుతాయని, వలసలు కూడా పెరుగుతాయని చెప్తున్నారు. మూడు రాజధానుల అంశాన్ని ఎవరైనా అడ్డుకుంటే తాము కూడా ఉద్యమిస్తామని ఉత్తరాంధ్ర జిల్లా వాసులు చెప్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లా వాసులు కూడా కోర్టుకు వెళ్తామని చెప్పడం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.