సమాజంలో రోజు రోజుకి చిన్నారుల మృతుల సంఖ్య పెరుగుతోంది. కొన్ని ప్రదేశాలలో తల్లిదండ్రులు నిర్లక్ష్యం వల్ల పసిబిడ్డలు ప్రాణాలు కోల్పోతున్నారు. మరి కొన్ని ప్రదేశాలలో డాక్టర్ ల నిర్లక్ష్యం వల్ల పసి బిడ్డల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. రోజు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ మార్పు మాత్రం రావడం లేదు. ఇప్పటికే ఎంతో మంది అభం శుభం ఎరుగని పసిబిడ్డలు పుట్టి నెల కూడా కాకముందే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి విజయవాడలో చోటు చేసుకుంది.
డాక్టర్ల నిర్లక్ష్యంతో ఒక బిడ్డ ప్రాణాలు కోల్పోయింది అని ఆ చిన్నారి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు హాస్పిటల్ ఎదుట ధర్నాకు దిగారు. పూర్తి వివరాల్లోకి వెళితే… విజయవాడలోని పాత ప్రభుత్వ ఆసుపత్రి మాతాశిశు సంక్షేమ విభాగం లో ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. పురిటిలోనే నవజాత శిశువు మరణించింది. దీంతో ఆ శిశువు తల్లిదండ్రుల గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఆస్పత్రి వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే పసిబిడ్డకు మృతి చెందాడు అని తల్లిదండ్రులు బంధువులు ఆరోపించారు. అనంతరం చనిపోయిన ఆ పసిబిడ్డ తో ఆస్పత్రి ముందు బైఠాయించారు. కొద్దిసేపు హాస్పిటల్ వాతావరణమంతా కలకలం రేగింది.
కాగా వైద్యులు మాత్రం తమ నిర్లక్ష్యం లేదని బదులు ఇస్తున్నారు. నవజాత శిశువు కన్న తల్లి గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఆ తల్లి ఆర్తనాదాలు విన్న ఇరుగుపొరుగువారు కన్నీళ్లు పెడుతున్నారు. ఇక గొడవ కాస్త పెద్ద కావడంతో పోలీసులు రంగంలోకి దిగి ఆ శిశువు తల్లిదండ్రులకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. కానీ వారు మాత్రం తన బిడ్డకు అన్యాయం జరిగింది అంటూ ఆరోపిస్తున్నారు. వైద్యులు మితిమీరి ప్రవర్తించడమే కాకుండా కనీసం పేషంట్ దగ్గర కూడా వెళ్లనివ్వలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే ఆ హాస్పిటల్లో డెలివరీ చేసిన తర్వాత పిల్లలను అమ్ముకుంటున్నారా అంటూ ఆరోపణలు గుప్పించారు.
కానీ వైద్యులు మాత్రం తమ తప్పేమీ లేదని, తాము నిర్లక్ష్యంగా వ్యవహరించడం లేదని వివరిస్తున్నారు. అంతేకాకుండా మరణించిన శిశువు తన భార్యకు జన్మించిన శిశువేనా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ శిశువు మరణంతో ఒక్కసారిగా హాస్పిటల్ వాతావరణం అంతా ఉద్రిక్తంగా మారింది.ఆ నవజాతశిశువుని చూసి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.