Vijay Sai Reddy: వైసిపి పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఈ పార్టీలో కీలకంగా వ్యవహరించిన వారిలో విజయసాయిరెడ్డి ఒకరు. వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో గత మూడు దశాబ్దాలుగా ఎంతో మంచి సన్నిహిత్యం ఉన్న విజయ్ సాయి రెడ్డి వైయస్సార్ మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి వెంట అడుగులు వేశారు. ఈ పార్టీలో కీలక సూత్రధారిగా ఉన్నటువంటి ఈయన ఇటీవల పార్టీకి రాజీనామా చేశారు అయితే కేవలం వైసీపీ పార్టీకి మాత్రమే కాకుండా తాను రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటానని వ్యవసాయమే చేసుకుంటానని తెలిపారు. ఇక పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత జగన్ చుట్టూ ఉన్న కోటరి గురించి విజయసాయిరెడ్డి మాట్లాడారే తప్ప జగన్మోహన్ రెడ్డి గురించి ఎక్కడ మాట్లాడలేదు.
ఇలా విజయసాయిరెడ్డి పార్టీ నుంచి బయటకు వెళ్లడంతో ఈ స్థాయిలో ఢిల్లీలో చక్రం తిప్పే నాయకుడు వైసిపిలో లేకుండా పోయారు ఈ క్రమంలోనే విజయ్ సాయి రెడ్డిని తిరిగి పార్టీలోకి ఆహ్వానించాలని జగన్మోహన్ రెడ్డికి సూచనలు చేసినట్టు తెలుస్తుంది. వైసిపి చెందిన ఓ కీలక నేత జగన్మోహన్ రెడ్డితో ఈ విషయం గురించి చర్చలు జరిపారని తెలుస్తోంది.పార్టీ కోసం విజయసాయిరెడ్డి ఎంతో చేశారని ఆయన చెప్పారట. అంతే కాదు విజయసాయిరెడ్డి పార్టీ నుంచి బయటకు వెళ్ళినా జగన్ మీద పల్లెత్తు మాట అనలేదని ఆయనకు జగన్ పట్ల విధేయత అలాగే ఉందని కూడా చెప్పారట. కొన్ని అనివార్య పరిస్థితుల వల్లనే విజయసాయిరెడ్డి బయటకు వెళ్ళారు తప్ప ఆయన వైసీపీ పట్ల విధేయంగానే ఉన్నారని జగన్ కు సూచించినట్టు తెలుస్తుంది.
ఈ విధంగా విజయ్ సాయి రెడ్డిని తిరిగి పార్టీలోకి ఆహ్వానించాలని కొంతమంది సూచిస్తున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారని తెలుస్తుంది అయితే విజయ్ సాయి రెడ్డి కాకినాడ సీపోర్ట్ వ్యవహారంలో భాగంగా చెప్పిన కొన్ని విషయాలు ఆధారంగానే లిక్కర్ స్కామ్ కూడా బయటపడిందని తద్వారా ఇప్పటికీ పార్టీకి చెందిన కొంతమంది కీలక నేతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విజయసాయిరెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోనే జగన్ కూడా సాయి రెడ్డికి ఆహ్వానం పంపించలేకపోతున్నారని తెలుస్తుంది ఇక విజయ సాయి రెడ్డి కనుక తిరిగి వస్తే వైసీపీ నుంచి బయటకు వెళ్లిన వారందరూ కూడా తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయని మరికొందరు భావిస్తున్నారు.
